Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో భానుడి భగభగలు ... ఈ పది చిట్కాలతో మండుటెండల నుండి బయటపడండి

మే నెల వచ్చేసింది... మండుటెండలను తెచ్చేసింది. ప్రస్తుతం అత్యధిక ఉష్షోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మండుటెండల నుండి బయటపడే చిన్నచిన్న చిట్కాలివే... 

highest maximum temperature recorded in Telangana ... How to protect from summer heat AKP
Author
First Published May 1, 2024, 10:24 AM IST

 హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఎండత తీవ్రత ఇలాగే వుండనుందని... ప్రజలు జాగ్రత్తగా వుండాలని వాతావరణ విభాగం సూచిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఎక్కువగా వుండే మధ్యాహ్నంపూట బయటకు రావద్దని సూచిస్తున్నారు. 

ఈ మండుటెండలతో ఇంట్లో వుండేవాళ్లు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇక బయటకు వెళితే భానుడి భగభగలను తట్టుకోలేం. ఇప్పటికే మండుటెండల్లో వ్యవసాయ పనులు చేస్తూ వడదెబ్బతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నాయి.రోడ్డు పక్కన తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసుకునేవారి పరిస్థితి కూడా ఈ ఎండలకు దారుణంగా మారింది. ఇలా సామాన్య ప్రజలు భగ్గుమంటున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

మరో మూడురోజులు ఇలాగే ఎండత తీవ్రత అధికంగా వుండనుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. చిన్నచిన్న చిట్కాలే మిమ్మల్సి ఎండవేడినుండి కాపాడతాయి. 

వేసవిలో పాటించాల్సిన చిట్కాలు : 

1. అవసరం అయితే తప్ప ఇళ్ళూ, కార్యాలయాల్లోంచి బయటకు వెళ్లకూడదు. ఏవైనా పనులుంటే ఉదయం, సాయంత్రం చూసుకోవాలి. 

2. బయటకు వెళ్లే సమయంలో గొడుగు, క్యాప్ తీసుకెళ్ళాలి. అలాగే తాగునీరు వెంట తీసుకెళ్లాలి. 

3. మండే ఎండల్లో తిరిగితే బాడీ టెంపరేచర్ పెరిగి వడదెబ్బకు గురయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ డీహైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  

4. శరీరానికి గాలి తగిలేలా దుస్తులు ధరించాలి. నల్లటి దుస్తులు తొందరగా వేడెక్కుతాయి... కాబట్టి ఆ రంగు దుస్తులు వేసుకోకపోవడం మంచిది. ఈ వేసవిలో తెల్లరంగు దుస్తులు ధరించడం మంచిది. కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. 

5. జంక్ ఫుడ్స్, మసాలాలు ఎక్కువగా వుండే ఫుడ్స్ తీసుకోవద్దు. పండ్లు, పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఛాయ్, కాపీ వంటివి కూడా తగ్గించుకోవాలి. 

6. ఈ ఎండలు, వేడి గాలుల నుండి శరీరాన్ని కాపాడుకోవాలంటే సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. టూవీలర్స్ పై ప్రయాణించేవారు కూలింగ్ గ్లాసెస్ వాడాలి. మహిళలు ముఖాన్ని చున్నీతోనో, స్కార్ప్ తోనో కప్పుకోవాలి. 

7. చిన్నపిల్లలు, వృద్దులను ఈ వేసవిలో ప్రయాణాలకు దూరంగా వుంచాలి. ఇంట్లోనూ బాగా వెంటిలేషన్ వుండి చల్లగా వుండే గదిలో వీరిని వుంచండి.

8. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే చల్లటి నీటితో స్నానం చేసి వెళ్లండి. అలాగే ఇంటికి చేరుకోగానే మళ్లీ చల్లటి నీటితో స్నానం చేయాలి. దీంతో ఎంతో ఉపశమనం లభిస్తుంది. 

9. గృహిణులు మధ్యాహ్నం సమయంలో వంటగదిలో వుండకపోవడమే మంచిది. ఉదయం లేదంటే సాయంత్రమే వంటపనులు చేసుకోవాలి. 

10. ఈ మండుటెండలు శరీరంలోని కీలకమైన గుండె, కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ముందుగానే ఈ సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా వుండాలి. 

 
  
 

Follow Us:
Download App:
  • android
  • ios