Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుండి టీజీకి మార్పు: కేంద్రం గెజిట్ నోటిఫికేషన్

రేవంత్ రెడ్డి సర్కార్ అభ్యర్థన మేరకు తెలంగాణలో వాహనాల నెంబర్ల ప్లేట్ల రిజిస్ట్రేషన్ ఇక నుండి మారనున్నాయి.

From TS to TG in Telangana, Centre approves new prefix for vehicle number plates lns
Author
First Published Mar 13, 2024, 10:39 AM IST

హైదరాబాద్:  తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ను టీఎస్ నుండి టీజీకి మారుస్తూ  కేంద్ర ప్రభుత్వం  మంగళవారంనాడు  గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల కోసం టీఎస్ స్థానంలో  టీజీని  ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన  వినతికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయమై  మంగళవారంనాడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్లేట్లపై  ఇక నుండి టీఎస్ స్థానంలో టీజీ అమల్లోకి రానుందని  న్యూఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తెలిపారు.

also read:ఇక నుండి సెప్టెంబర్ 17న హైద్రాబాద్ విమోచన దినోత్సవం: కేంద్రం నోటిఫికేషన్

మోటార్ వాహనాల చట్టం 1988 (59 ఆఫ్ 1988) సెక్షన్ 41లోని సబ్ సెక్షన్ ఆరు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుండి  టీఎస్ స్థానంలో టీజీ అమల్లోకి రానుంది.ఈ మార్పు కొత్త వాహనాలకు వర్తించనుంది. టీఎస్ నెంబర్ ప్లేట్లతో ఉన్న వాహనాలు కొనసాగుతాయి.  కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనే వాహనాలకు ఇక నుండి టీఎస్ స్థానంలో టీజీని కేటాయించనున్నారు.

also read:గీతాంజలి మృతిపై రాజకీయరంగు: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మాటల యుద్ధం, ఎవరి వాదన వారిదే...

తెలంగాణలో అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయానికి అనుగుణంగా  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.  రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు  టీఎస్ స్థానంలో  టీఎస్ ను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి

2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్  వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో   కేంద్రం టీజీని కేటాయిస్తూ టీఎస్ గా మార్చుకుందని  కాంగ్రెస్ సర్కార్ ఆరోపించింది. ఈ కారణంగానే తమ ప్రభుత్వం  అధికారంలోకి రాగానే  టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios