Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ! ఇంతకీ అర్హులెవరంటే?  

volunteer: తెలంగాణలో ఇప్పుడూ మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అయితే..ఈ విషయాన్ని మీరు  కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న అంశం తెలంగాణలో కూడా అమలు కానున్నది.  

CM Revanth Reddy hints at volunteer system in Telangana after polls KRJ
Author
First Published Apr 11, 2024, 10:37 PM IST

Volunteer System:  ఆంధ్రప్రదేశ్ త‌ర‌హాలో తెలంగాణలోనూ వాలంటీర్ల వ్య‌వస్థను ప్ర‌వేశ‌పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణలో వాలంటీర్ల వ్య‌వస్థను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కార్యాచరణ ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఈ మేరకు పరోక్షంగా ప్రకటన చేశారు.

వాస్తవానికి ఏపీలో జగన్ అయినా తరువాత సంచనల నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో, అలాగే. ప్రభుత్వంపై సానుకూల ప్రభావం ఏర్పార్చడంలో ఈ వ్యవస్థ కీలకంగా మారింది.  దీంతో  ఇతర ప్రభుత్వాలు కూడా వాలంటీర్ వ్యవస్థ పై దృష్టి సారించాయి. 

తెలంగాణలో కూడా ఏపీ తరహాలో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని పలుమార్లు వెలిబుచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్..పార్లమెంటు ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలను రాబట్టేందుకు వ్యూహాల్లో చేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గాల వారిగా.. సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ క్రమంలోనే బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఏపీ తరహాలో ప్రజలకు సంక్షేమ పథకాల సక్రమంగా అందించడానికి, ప్రజలకు సహాయంగా వాలంటీర్లను తీసుకువచ్చే ఆలోచనలున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాల్లో ‘ఇందిరమ్మ కమిటీ’ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రీయాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని, యువతను వాలంటీర్ గా ఎంపిక చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం నిరుద్యోగ యువతను వాలంటీర్లు నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.  

వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులకు ప్రభుత్వం పథకాలు అందేలా చేయడం. వాలంటీర్ తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి వినతులు తీసుకోవడం, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులతో సమన్యయం కావడం. అలాగే.. లబ్దిదారులకు ఎంపిక.. వారి సమస్యల పరిష్కారంలో వీరిదే కీలక పాత్ర పోషిస్తారు. విద్య, వైద్యపరంగా తమ పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.

అలాగే.. రోడ్లు, వీధి దీపాలు, మురుగు నీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి ఇలా ప్రతి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాలంటీర్లు పర్యవేక్షించాలి. ప్రభుత్వం తరుపు నుంచి బాధ్యతలు నిర్వహించే వాలంటీర్లకు ఏపీలో రూ. 5 వేలు ఇస్తుండగా.. తెలంగాణలో ‘ఇందిరమ్మ కమిటీ’ ద్వారా ఎంపికైన వాలంటీర్లకు రూ.6 వేల వరకు గౌరవ వేతనం అందించే అవకాశముందట.  
 

Follow Us:
Download App:
  • android
  • ios