Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో అయోద్య రామమందిర స్మారక స్టాంపులకు ఫుల్ డిమాండ్.. ఎక్కడ దొరుకుతాయంటే..

అయోధ్యలోని రామమందిరం చిత్రంతో తయారైన స్మారక స్టాంపులకు హైదరాబాద్‌లో విపరీతమైన డిమాండ్ నెలకొంది. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఫిలాట్లీ విభాగం మూడు రోజుల్లో 500 నుండి 700 మినియేచర్‌లను విక్రయించింది. 

Ayodhya Ram Mandir commemorative stamps are in full demand in Hyderabad, Where can they be found - bsb
Author
First Published Feb 20, 2024, 10:24 AM IST

హైదరాబాద్ : రామభక్తిలో హైదరాబాదీలు మేమేం తీసిపోలేదని నిరూపించుకుంటున్నారు. అయోధ్య రామ మందిరం బొమ్మతో చిత్రించిన స్మారక స్టాంపులను హాట్ కేకుల్లా ఎగరేసుకుపోతున్నారు. ఓ వైపు భక్తి, మరోవైపు స్టాంపుల సేకరణ ఆసక్తి కలిసి.. ఈ స్మారక స్టాంపులకు విపరీతంగా గిరాకీ పెరిగిపోతోంది. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ లోని ఫిలాట్లీ విభాగం కేవలం మూడు రోజుల వ్యవధిలో 500 నుండి 700వరకు ఈ స్టాంపులను అమ్మింది. శ్రీరాముని మీదున్న ప్రగాఢమైన భక్తిని, కొత్తగా నిర్మించిన మందిరం  ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ఈ స్మారక స్టాంపుల సేకరణలో, ఆరు విభిన్న స్టాంపులు ఉన్నాయి. శ్రీరాముని కథనంతో ప్రమేయం ఉన్న ముఖ్య వ్యక్తులు, చిహ్నాలను ఇందులో చిత్రీకరించారు. అద్భుత రామమందిరం నుండి భగవాన్ గణేష్, భగవాన్ హనుమాన్ వంటి దేవతా మూర్తులు, ప్రతి స్టాంప్ లోనూ రామాయణ ఇతిహాసం  సారాంశాన్ని గుర్తొచ్చేలా తీర్చదిద్దారు. ముఖ్యంగా, సూర్య కిరణాలు, చౌపాయి 'మంగళ భవన్ అమంగల్ హరి' వంటి అంశాలకు సంబంధించిన బంగారు ఆకులను ఉపయోగించడం ద్వారా స్టాంప్ సేకరణ దారులను, భక్తులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా తయారు చేశారు. 

గుడ్ న్యూస్ : నేడు పెళ్లైన అమ్మాయిల తల్లుల ఖాతాలోకి డబ్బులు...

'పంచభూతాలు'గా పిలువబడే ఆకాశం, గాలి, అగ్ని, భూమి, నీరు అనే ప్రకృతిలోని ఐదు అంశాలను ప్రతిబింబించే డిజైన్‌లతో తయారైన ఈ స్మారక స్టాంపులు కేవలం ఫిలాటెలిక్ ప్రాముఖ్యత(స్టాంపుల సేకరణ హాబీ)ను అధిగమించాయి. ఇది ఆధ్యాత్మికత, కళాత్మకతల సామరస్య కలయికకు ప్రతీకగా నిలిచాయి. దీనితోపాటు కేవలం 2,100 మాత్రమే ముద్రించబడడడం, ఈ స్టాంపుల పరిమిత లభ్యత కూడా  ఔత్సాహికులలో ఉత్సాహాన్ని పెంచింది. విపరీతమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా, తెలంగాణ తపాలా శాఖ కొన్ని ఆంక్షలు విధించింది.

ఇవి ఆసక్తి ఉన్న అందరికీ అందేలా చూడడానికి ఒక వ్యక్తికి రెండు మినియేచర్‌లను మాత్రమే అమ్మేలాపరిమితం చేసింది. దీనివల్ల ఔత్సాహికులు ఎక్కువ సంఖ్యలో దీన్ని పొందే అవకాశం ఉంది. దీని ధర రూ. 100 రూపాయలు. కవర్ రూ.50. మొత్తం రూ.150 లు. ఇవి హైదరాబాద్ GPOలో అందుబాటులో ఉన్నాయి. ఇండియా పోస్ట్‌లో ఫిలాటలీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సునీల్ శర్మ, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ తమకు ఇవి ఎంత బధ్రత నడుమ వస్తున్నాయో, వాటికి ఉన్న పరిమితులను వివరించారు. 

అయోధ్యలోని రామమందిరం బొమ్మతో ఉన్న స్మారక స్టాంపులకు ఎదురవుతున్న అపూర్వమైన డిమాండ్ రాముడి పట్ల ఉన్న శాశ్వతమైన భక్తిప్రపత్తులను, కొత్తగా నిర్మించిన మందిరం సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ విలువైన స్టాంపును దక్కించుకునేందుకు స్టాంపు కలెక్టర్లు, భక్తులు ఒకే విధంగా ఆసక్తి, ఉత్సాహం చూపుతున్నారని.. ఇది ఊహించలేదని వారు అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios