Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ అప్‌డేట్: ఈ ఫీచర్ మళ్లీ వస్తుంది.. ఫోటోస్, వీడియోస్ సేవ్ చేయలేరు..

వాట్సాప్ డెస్క్‌టాప్ వినియోగదారులకు ఒకసారి వీడియోలు మరియు ఫోటోలను ఒకసారి వీక్షణను పంపే సామర్థ్యాన్ని తిరిగి తీసుకువస్తోంది, వినియోగదారు గోప్యతను మెరుగుపరుస్తుంది. వీక్షించిన తర్వాత అదృశ్యమయ్యే తాత్కాలిక మీడియాను పంపడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది.
 

WhatsApp update: Messaging app to bring THIS feature back for web users-sak
Author
First Published Nov 27, 2023, 1:07 PM IST

WhatsApp ఇప్పుడు డెస్క్‌టాప్ యూజర్లకు వీడియోలను వ్యూ వన్స్ అప్షన్ తో మీ కాంటాక్ట్‌లకు  పంపే ఫీచర్ ను మళ్లీ పరిచయం చేస్తోంది. గత సంవత్సరం, Meta యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వెబ్ వెర్షన్ నుండి ఫోటోలు ఇంకా వీడియోలను వ్యూ వన్స్   ఇంకా  ఓపెన్ వన్స్   అప్షన్ ని  తీసివేసింది, ఈ నిర్ణయంతో కొంతమంది వినియోగదారుల నుండి విమర్శలను కూడా ఎదుర్కొంది. దింతో ఇప్పుడు, వాట్సాప్ మనసు మార్చుకుని  వినియోగదారులకు ప్రైవసీ  మెరుగుపరచడానికి వ్యూ వన్స్ ఎంత కీలకమో గ్రహించింది.

వినియోగదారులు Snapchat లాగానే  WhatsApp వ్యూ వన్స్ ఫంక్షన్‌తో మెసేజ్ పొందే  రిసీవర్  గ్యాలరీలో స్టార్ చేయబడకుండా షార్ట్  టైం  వీడియో లేదా ఫోటో  షేర్ చేయవచ్చు. ఈ ఫంక్షన్‌తో ప్రైవేట్ లేదా ప్రైవసీ  కంటెంట్‌ను షేర్ చేయడం ఈజీ  చేస్తుంది, అయితే  పంపించిన వీడియో లేదా ఫోటో  రిసీవర్ ఫోన్లో  సేవ్ చేయడం సాధ్యం కాదు ఇంకా  తక్కువ టైం  మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోవాలి.

విండోస్,  మాక్ ఓఎస్ ఉన్న  డెస్క్‌టాప్ ప్రోగ్రామ్‌లో ఇమేజ్‌లు ఇంకా  వీడియోల కోసం వ్యూ వన్స్  ఫీచర్  WhatsApp ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తోందని WAbetainfo నివేదించింది. ఈ ఫంక్షన్‌ని ఉపయోగించి వినియోగదారులు మీడియాను షేర్ చేయవచ్చు, అయితే రిసీవర్ ఒకసారి ఓపెన్ చేసి చుసిన తర్వాత అదృశ్యమవుతుంది.  

"వ్యూ వన్స్" అప్షన్ ఉపయోగించి పంపిన ఫోటోలు ఇంకా  వీడియోలను షేర్ చేయడం, స్టార్ చేయడం, సేవ్ చేయడం లేదా ఫార్వార్డ్ చేయడం సాధ్యపడదు. రిసీవర్ రీడ్ రిసిప్ట్ ఎనేబుల్ చేసి ఉంటే, రిసీవర్  "వ్యూ వన్స్" అనే ఫోటో లేదా వీడియోని మాత్రమే పంపినవారు తెలుసుకోవచ్చు. ఫోటో లేదా వీడియోను  పంపిన 14 రోజులలోపు ఓపెన్ చేయకపోతే  ఆటొమేటిక్ గా డిలేట్ అయిపోతుంది.

 "వ్యూ వన్స్" అప్షన్ తో కంటెంట్ సెండ్  చేసినప్పుడు, దానిని  ఒక్కసారి మాత్రమే చూడటానికి ఉంటుంది అలాగే దాన్ని షేర్ చేయడం, సేవ్ చేయడం లేదా ఫార్వార్డ్ చేయడం సాధ్యపడదు. రిసీవర్  "వ్యూ వన్స్" ఫోటో లేదా వీడియోని ఓపెన్ చేసిన తర్వాత చాట్ నుండి ఆటోమేటిక్ గా అదృశ్యమవుతుంది ఇంకా  రిసీవర్ కు  యాక్సెస్ ఉండదు.

వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌ను కూడా పరిచయం చేస్తోంది,  దీని ద్వారా  పెద్ద గ్రూవ్స్ తో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ అంతరాయం లేకుండా చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios