వేటింగ్ ఈజ్ ఓవర్ ! ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో గొప్ప స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర తెలుసా..?

నథింగ్ ఫోన్ 1 ఎట్టకేలకు అధికారికంగా ఇండియాలో అలాగే ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో 900 LEDలు, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇండియాలో ఫోన్ (1) రూ. 32,999 నుండి మొదలై రూ. 38,999 వరకు ఉంటుంది. 

waiting is over great smartphone with transparent design launched know its features price

నథింగ్ ఫోన్ 1తో ఇప్పుడు కంపెనీ  మొదటి స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. ఈ సంవత్సరంలో చాలా చర్చనీయాంశమైన స్మార్ట్‌ఫోన్ ని నేడు లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లాంచ్ చేసారు. నథింగ్ నుండి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 7 సిరీస్ 5G చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది ఇంకా ఈ డివైజ్ అద్భుతమైన ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో వస్తుంది, అలాగే ఇతర ఫోన్‌ల కంటే భిన్నమైన రూపాన్ని ఇస్తుంది. నథింగ్ ఫోన్ (1) అనేది అద్భుతమైన ఫీచర్లతో కూడిన మిడ్-రేంజ్ ఫోన్. నథింగ్ ఫోన్ (1) ఇండియా, యూరప్ కొన్ని ఆసియా మార్కెట్లలో అందుబాటులోకి ఉంది. నథింగ్ ఫోన్ (1) ఫీచర్లు అండ్ స్పెసిఫికేషన్‌ల గురించి చూస్తే...

నథింగ్ ఫోన్ (1): ఇండియాలో ధర 
నథింగ్ ఫోన్ (1) మూడు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 8GB+128GB ధర రూ.32,999, 8GB+256GB మోడల్ ధర రూ.35,999, టాప్-లైన్ 12GB+256GB వేరియంట్ ధర రూ.38,999. ఈ ఫోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. నథింగ్ ఫోన్ (1) పాస్‌ని కొనుగోలు చేసిన వారికి ప్రీ-ఆర్డర్ కోసం ఫోన్ ఇప్పుడు అందుబాటులో ఉంది, జూలై 21న ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది.

ఇండియాలో నథింగ్ ఫోన్ (1) వేరియంట్ ధర

8జి‌బి + 128జి‌బి వేరియంట్ కోసం 32,999  
8జి‌బి+256జి‌బి వేరియంట్‌కు రూ.35,999
12జి‌బి + 256జి‌బి వేరియంట్ కోసం 38,999 

నథింగ్ ఫోన్ (1): ఆఫర్‌
లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే  ఫ్లిప్‌కార్ట్‌లో HDFC బ్యాంక్ కార్డ్‌లతో రూ. 2,000 ఇన్స్టంట్ తగ్గింపును పొందవచ్చు. ప్రీ-ఆర్డర్ పాస్  ఉన్న వినియోగదారులు 45W ఛార్జర్‌ను రూ. 1,499కి పొందవచ్చు.  

నథింగ్ ఫోన్ (1): స్పెసిఫికేషన్‌లు 
నథింగ్ ఫోన్ (1) 6.55-అంగుళాల OLED డిస్‌ప్లేతో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, పూర్తి HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. ఫోన్‌లో Qualcomm  స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్ 12జి‌బి ర్యామ్, 256జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్‌ ఇచ్చారు. ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో ట్రాన్స్పరెంట్ వెనుక వస్తుంది, ఇది ఫోన్ వెనుక భాగంలో LED లైట్ల సెట్. ఫోన్ వెనుక, ముందు  గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. నథింగ్ ఫోన్ (1) వెనుక భాగంలో 50MP (Sony IMX766) ప్రైమరీ స్నాపర్, 50MP (Samsung JN1) అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో 16MP సోనీ IMX471 సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

నథింగ్ ఫోన్ (1): ఫీచర్లు 
ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ ఉంది, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. అయితే డివైజ్ బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్‌ రాదు. నథింగ్ పవర్ 45W చార్జర్ విడిగా రూ. 2,499కి విక్రయిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే నథింగ్ ఫోన్ (1) చాలా బ్లోట్‌వేర్ యాప్‌ లేని Android 12 ఆధారంగా నథింగ్ OSలో రన్ అవుతుంది. ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఫోన్‌లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, డ్యూయల్ స్పీకర్ సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios