వివో బెస్ట్ బడ్జెట్ ఫోన్.. లాంగ్ లైఫ్ బ్యాటరీతో ఈ ఫీచర్లన్ని ఇంత తక్కువ ధరకా..
వివో Y02లో గ్లోబల్ వేరియంట్ లాగానే సింగిల్ కెమెరా సెటప్ ఉంది, దీనికి 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. ఎల్‌ఈడి ఫ్లాష్ లైట్ కెమెరాతో సపోర్ట్ చేస్తుంది.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో లో బడ్జెట్ ఫోన్ వివో వై02 ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండియా కంటే ముందే ఇండోనేషియాలో ప్రవేశపెట్టారు. వివో వై02 5000mAh బ్యాటరీ, 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. వివో ఈ బడ్జెట్ ఫోన్‌లో 3జిబి ర్యామ్ తో 32జిబి వరకు స్టోరేజ్ ఉంది. వివో వై02లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్ల గురించి...
వివో వై02 ధర
ఆర్చిడ్ బ్లూ అండ్ కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్‌లో వివో వై02 లభిస్తుంది. 3 జీబీ ర్యామ్‌తో కూడిన 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. వివో ఇ-స్టోర్ నుండి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్లు
అండ్రాయిడ్ 12 (Go Edition) ఫన్ టచ్ ఓఎస్ 12 వివో Y02లో వస్తుంది. వివో వై02కి 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉంది, 720x1600 పిక్సెల్ రిజల్యూషన్ అండ్ 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. డిస్ ప్లేతో ఐ ప్రొటెక్షన్ మోడ్ సపోర్ట్ ఉంది. ఫోన్లో ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జిబి ర్యామ్ తో 32జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. అయితే, మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
కెమెరా
వివో Y02లో గ్లోబల్ వేరియంట్ లాగానే సింగిల్ కెమెరా సెటప్ ఉంది, దీనికి 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. ఎల్‌ఈడి ఫ్లాష్ లైట్ కెమెరాతో సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది.
బ్యాటరీ లైఫ్
వివో ఈ కొత్త ఫోన్ లో 5,000mAh బ్యాటరీ ఉంది, ఇంకా 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, జిపిఎస్, microUSB ఛార్జింగ్ సపోర్ట్ 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఫోన్ బరువు 186 గ్రాములు.