Asianet News TeluguAsianet News Telugu

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్ వంటి ఫీచర్..

ఇప్పుడు Instagram వినియోగదారులు WhatsApp ఇంకా  Facebook వంటి సెంట్ మెసేజెస్ కూడా ఎడిట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ చాలా కాలం క్రితమే ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని అందించింది. అయితే ఈ ఫీచర్ టెస్టింగ్ చాలా కాలంగా జరుగుతోంది.
 

Update Great update in Instagram now you can edit messages even after sending-sak
Author
First Published Dec 22, 2023, 7:01 PM IST

సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు Instagram వినియోగదారులు WhatsApp అండ్ Facebookలో లాగానే  మెసేజెస్  కూడా ఎడిట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ చాలా కాలం క్రితం ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని అందించింది. అయితే ఈ ఫీచర్ టెస్టింగ్ చాలా కాలంగా జరుగుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పంపిన మెసేజెస్ ఎడిట్ చేయడానికి  టైం  లిమిట్ సెట్ చేయబడింది, అంటే మీరు మెసేజ్  ఎప్పుడు పడితే అప్పుడు ఎడిట్ చేయలేరు. కొత్త అప్‌డేట్ ప్రకారం, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేసిన మెసేజెస్ పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్ చేయవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్, ఫేస్‌బుక్ ఇంకా  టెలిగ్రామ్‌లో చాలా కాలంగా ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ మరో పెద్ద అప్‌డేట్‌ను కూడా విడుదల చేయబోతోంది. ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త అప్‌డేట్ తర్వాత, వినియోగదారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ మార్చగలరు, అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది. 

ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ కొత్త ఫీచర్‌కి 'బ్యాక్‌డ్రాప్' అని పేరు పెట్టారు. ఈ సమాచారాన్ని మెటా జనరేటివ్ AI హెడ్ అహ్మద్ అల్ ధాలే అందించారు. ప్రస్తుతం, బ్యాక్‌డ్రాప్ ఫీచర్ US వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios