వావ్.. అమేజింగ్.. ఇలాంటి చెత్త డబ్బాని ఎక్కడైనా చూసారా.. సోషల్ మీడియాలో వైరల్..
ఈ డస్ట్‌బిన్ గంటకు 101 కి.మీ వేగంతో వెళ్తుంది. దీనిని ఇంజనీర్ అండ్ యూట్యూబర్ క్రిస్ రోలిన్స్ రూపొందించారు. స్లో థింగ్స్ తనకు అస్సలు నచ్చవని, అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డస్ట్‌బిన్‌ను తయారు చేశానని క్రిస్ రోలిన్స్ చెప్పాడు.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చెత్త డబ్బా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యూట్యూబర్ క్రిస్ రోలిన్స్ ఒక చెత్త డబ్బాని తయారు చేసింది చూడొచ్చు. విశేషం ఏంటంటే ఈ చెత్త డబ్బా పేరు గిన్నిస్ బుక్‌లో కూడా నమోదైంది.
ఈ డస్ట్‌బిన్ గంటకు 101 కి.మీ వేగంతో వెళ్తుంది. దీనిని ఇంజనీర్ అండ్ యూట్యూబర్ క్రిస్ రోలిన్స్ రూపొందించారు. స్లో థింగ్స్ తనకు అస్సలు నచ్చవని, అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డస్ట్‌బిన్‌ను తయారు చేశానని క్రిస్ రోలిన్స్ చెప్పాడు.
క్రిస్ ఈ మోటరైజ్డ్ చెత్త డబ్బాను నిర్మించడానికి పెట్రోల్ ఇంజన్, సైకిల్ చక్రాలు, కొన్ని ఛాసిస్‌లను ఉపయోగించాడు.ఈ చెత్త డబ్బాలో 12 హార్స్‌పవర్ హోండా పెట్రోల్ ఇంజన్‌ను అమర్చినట్లు క్రిస్ చెప్పారు. అయితే, దీన్ని తయారు చేయడం అంత సులభం కాదు.
చెత్త డబ్బా లోపల ఇంజిన్‌ను అమర్చడంలో క్రిస్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు. దీంతోపాటు ఏరోడైనమిక్స్, స్టెబిలిటీ, స్టీరింగ్ ఇతర వాటిలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం జర్మనీలో తయారైన తొలి త్రీవీలర్ కారును స్ఫూర్తిగా తీసుకున్నాడు.
ఈ చెత్త కుండీని తయారు చేసిన తర్వాత, క్రిస్ రోలిన్స్ ఇంకా అతని బృందం టెక్సాస్‌లోని రెడ్‌లైన్ రేస్‌వేకి తీసుకెళ్లారు. దీని ఫుల్ స్పీడ్ ఇక్కడ పరీక్షించారు, ఇది వీరికి షాకింగ్ కలిగించింది ఏంటంటే ఈ చెత్త డబ్బా 62 mph వేగంతో అంటే గంటకు 101 కి.మీతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డస్ట్‌బిన్‌గా మారింది.