ఊసరవెల్లి వంటి రంగులు మార్చే టెక్నాలజి.. ఒక్క క్లిక్‌లో స్మార్ట్‌ఫోన్ పూర్తిగా మారుతుంది..
కొత్త టెక్నాలజీకి సంబంధించి డైవైజ్ కి మరింత అందాన్ని ఇవ్వడానికి ఈ టెక్నాలజి మొబైల్ ఫోన్ వంటి డివైజ్ వెనుకకు జోడించవచ్చని కంపెనీ తెలిపింది. ఊసరవెల్లి కలర్ టెక్నాలజి సబ్-మైక్రాన్ ప్రిజం మెటీరియల్ అండ్ ఎలక్ట్రికల్ కంట్రోలర్ ప్రిజం స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తుంది.
బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో టెక్నో కంపెనీ ఊసరవెల్లి కలరింగ్ టెక్నాలజీని ప్రకటించింది. ఈ టెక్నాలజీ సాయంతో ఒక్క క్లిక్‌తో ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగును పూర్తిగా మార్చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో టెక్నాలజిని ఉపయోగించి ఒక బటన్‌ను తాకినప్పుడు ఎన్నో రకాల కలర్ నమూనాలను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. MWC ఈవెంట్‌లో కంపెనీ మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ V ఫోల్డ్‌ను కూడా విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ ప్రపంచంలోనే మొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్‌ను అమర్చారు.
ఊసరవెల్లి లాంటి రంగులు మార్చే టెక్నాలజి
కొత్త టెక్నాలజీకి సంబంధించి డైవైజ్ కి మరింత అందాన్ని ఇవ్వడానికి ఈ టెక్నాలజి మొబైల్ ఫోన్ వంటి డివైజ్ వెనుకకు జోడించవచ్చని కంపెనీ తెలిపింది. ఊసరవెల్లి కలర్ టెక్నాలజి సబ్-మైక్రాన్ ప్రిజం మెటీరియల్ అండ్ ఎలక్ట్రికల్ కంట్రోలర్ ప్రిజం స్పెక్ట్రమ్‌ను ఉపయోగిస్తుంది.
Tecno Camon 19 ప్రో మాండ్రియన్ ఎడిషన్
ఈ టెక్నాలజి కొత్తది అయినప్పటికీ, బ్యాక్ కవర్ కలర్ మార్చడం కొత్తది కాదు. గత ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ టెక్నో కామన్ 19 ప్రో మాండ్రియన్ ఎడిషన్‌ను తొలగించగల బ్యాక్ కవర్‌తో విడుదల చేసింది. సింగిల్ 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.17,999.
ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, పింక్ అండ్ వైట్‌లో మారుతున్న మల్టీ-కలర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. Tecno ప్రకారం, టెక్నో కామన్ 19 Pro మాండ్రియన్ ఎడిషన్ మోనోక్రోమ్ బ్యాక్ కవర్ సూర్యరశ్మికి గురైనప్పుడు రంగును మారుస్తుంది, కంపెనీ పాలీక్రోమాటిక్ ఫోటోఐసోమర్ టెక్నాలజీతో ఇది సాధ్యమైంది.