Asianet News TeluguAsianet News Telugu

నుదుటిపై క్యూఆర్ కోడ్ టాటూ వేయించుకున్న వ్యక్తి... కారణం అడిగితే షాక్!

ప్రజలు వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటీ  వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మరో వ్యక్తి చేసిన హంగామా వార్తల్లో నిలిచింది.  
 

The man who put QR code on his forehead, if you ask the reason, you will be shocked!-sak
Author
First Published Mar 2, 2024, 4:01 PM IST

టాటూ ప్రియుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. పాత టాటూ స్టైల్‌కు గుడ్‌బై చెబుతూ కొత్త టాటూలు వేయించుకుంటున్నారు. మనం ఇప్పుడు టాటూలలో చాలా వెరైటీలు చూస్తున్నాం. వారికి ఇష్టమైన వారి పేరు ఇంకా గుర్తులు టాటూ వేయించుకునే వారు ఐదుగురిలో ఒకరిని  చుడవచ్చ. పచ్చబొట్లు లేని వారు చాలా అరుదు.  కొందరు కాళ్లపై, కడుపుపై  వారి ప్రేమికుల  పేర్లను పెట్టుకుని వార్తల్లో నిలిచారు. 

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా టాటూకు ఆదరణ పెరిగింది. శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకున్నవారూ ఉన్నారు. రికార్డు కొత్త్తడానికి  రోజుకో ప్రయోగం జరుగుతోంది. ఇప్పుడు అలాంటి ప్రయోగం ఒకటి వైరల్‌గా మారింది.

QR కోడ్ ప్రస్తుతం చర్చలో ఉంది. మీరు వీధి వ్యాపారుల నుండి ఆన్‌లైన్ అకౌంట్ తెరవడం వరకు QR కోడ్‌లను చూస్తారు. QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నగదు బదిలీ మాత్రమే కాదు, QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా హోటల్ మెనూ, Insta, WhatsApp వంటి సోషల్ నెట్‌వర్క్‌లు తెరవబడతాయి. దీనిని  ఒక వ్యక్తి భిన్నంగా ఉపయోగించారు. క్యూఆర్‌ కోడ్‌ను పంపడం లేదా బోర్డు పట్టుకుని నడవడం ఎందుకంటూ తన నుదుటిపై క్యూఆర్ కోడ్‌ను టాటూగా వేయించుకున్నాడు.  

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో నుదిటిపై క్యూఆర్ కోడ్ టాటూతో ఉన్న వ్యక్తిని మీరు చూడవచ్చు. యూనిలాడ్ అనే అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేయబడింది. మీరు వీడియో ప్రారంభంలో నిద్రిస్తున్న వ్యక్తిని చూడవచ్చు. అతని నుదిటిపై QR కోడ్ స్టికర్   అతికించబడుతుంది. తరువాత  పచ్చబొట్టు సూదితో వేశారు. టాటూలు వేయించుకున్న వ్యక్తికి నొప్పిగా ఉంటే వారి ముఖాన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. క్యూఆర్‌కోడ్‌ టాటూ వేయించుకునే వరకు ఆ బాధను మింగేసిన ఆ వ్యక్త్తి  ఎట్టకేలకు ముఖంపై చిరునవ్వు చిందించాడు.

QR కోడ్ టాటూ పూర్తయిన తర్వాత, టాటూ కళాకారుడు వ్యక్తి   నుదిటిపై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తాడు. అతను స్కాన్ చేసిన వెంటనే, ఆ వ్యక్తి   Instagram అకౌంట్  ఓపెన్ అయింది.

ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పేరు, దయచేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి అని స్నేహితులు ఇంకా బంధువులను అభ్యర్థించడం కంటే ఇది మంచి ఆలోచన అని కొందరు అంటున్నారు. దీనికి మీరు మీ ఖాతా పేరు లేదా లింక్‌ను పంపాల్సిన అవసరం లేదు. నుదిటిపై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి నమోదు చేయండి. ఎక్కువ పని లేకుండానే అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరుచుకుంటుంది. 

అతని వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. 1.7 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వీడియోని చూసారు. కొందరు యుజర్లు దీనిని నకిలీ టాటూగా మరికొందరు  ఆయన పచ్చబొట్టు కారణంగా ఖాతా తెరిస్తే ప్రమాదమని కూడా హెచ్చరిస్తున్నారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UNILAD (@unilad)

Follow Us:
Download App:
  • android
  • ios