Asianet News TeluguAsianet News Telugu

పబ్లిక్ టాయిలెట్లో యూరిన్ టెస్ట్: వెంటనే రిపోర్టు కూడా.! వావ్ టెక్నాలజీ...

ఆరోగ్యంగా ఉన్నామని చెప్పుకునే వారు సంవత్సరానికి ఒకసారి కూడా మూత్ర పరీక్ష చేయించుకోరు. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఇంకా  డాక్టర్ సలహా ఇస్తే అప్పుడు ఈ పరీక్ష చేయించుకుంటారు. కానీ మీరు డాక్టర్ సలహా లేకుండా కూడా పబ్లిక్ టాయిలెట్లో సెల్ఫ్-టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో మీరే చూడండి... 

Self-urine test in public toilet: if there is any disease, report is immediately in your hands!-sak
Author
First Published May 1, 2024, 5:03 PM IST

మన శరీరానికి ఏదైనా వ్యాధి సోకిందో లేదో తెలుసుకోవడానికి రక్త, మూత్ర పరీక్షలు చేస్తారు. మూత్ర పరీక్ష అనేక వ్యాధుల లక్షణాలను చూపుతుంది. మూత్ర పరీక్షల కోసం ప్రజలు మూత్ర-రక్త పరీక్ష కేంద్రానికి(diagnostic center) వెళ్తుంటారు. కానీ చైనాలో మీరు సెల్ఫ్  యూరిన్  టెస్ట్  చేసుకోవచ్చు. ఇందుకు  ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. మీ మూత్రంలో ఏదైనా వ్యాధి లక్షణాలు ఉంటే మిరే గుర్తించవచ్చు. మూత్ర పరీక్ష కోసం పబ్లిక్‌ టాయిలెట్‌కి వెళ్లాల్సిందే. పబ్లిక్ టాయిలెట్‌లో మూత్ర విసర్జన చేయడం అసురక్షితం. క్లిన్ లేకుండా  మురికి వాసన వచ్చినా ఇన్ఫెక్షన్ వస్తుందనే భయం ఉంటుంది. కాబట్టి, మూత్ర పరీక్ష ఎలా అని మీరు ఆశ్చర్యపోతున్నారా... 

ఇప్పుడు చైనా టాయిలెట్లు హైటెక్ గా మారాయి. అవును చైనాలో ఫ్యూచరిస్టిక్ టాయిలెట్ నిర్మిస్తున్నారు. ఆటోమేటిక్ గా మూత్ర పరీక్షా , ఎనాలిసిస్  ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవచ్చు. బీజింగ్ ఇంకా షాంఘై వంటి ప్రముఖ చైనా నగరాల్లోని పబ్లిక్ కోసం పురుషుల టాయిలెట్లలో ఈ స్మార్ట్ టాయిలెట్లు ప్రారంభించారు. 

ఈ టాయిలెట్ కేవలం 20 యువాన్లకు ఇన్స్టంట్  అండ్  ఖచ్చితమైన మూత్ర పరీక్ష రిపోర్ట్స్ అందిస్తుంది. అయితే ఈ సర్వీస్  దాదాపు 230 రూపాయలకు అందుబాటులో ఉంటుంది.

ఈ మెషిన్  విటమిన్ సి, క్రియాటినిన్, గ్లూకోజ్ సహా కొన్నిటిని  గుర్తిస్తుంది. కానీ ఈ రిపోర్ట్స్ ఖచ్చితం కాదు. మీరు దానిని సూచనగా మాత్రమే పరిగణించవచ్చు. మీ మూత్రంలో ఒక ఏదైనా ఎక్కువ మొత్తంలో కనిపిస్తే, మీరు అప్రమత్తం కావచ్చు ఇంకా  సంబంధిత  పరీక్షలు చేయించుకోవచ్చు. 

 

షాంఘైకి చెందిన డాక్యుమెంటరీ డైరెక్టర్ క్రిస్టియన్ పీటర్సన్ ఈ టాయిలెట్ ఫోటోను షేర్ చేశారు. తాజాగా  షాంఘై అంతటా పురుషుల రెస్ట్‌రూమ్‌లలో హెల్త్ స్క్రీనింగ్ యూరినల్స్ కనిపించడం ప్రారంభించాయి. ఒక ప్రైవేట్ కంపెనీ RMB 20కి దీన్ని తయారు చేస్తోంది   అంటూ పోస్ట్ చేసారు. 

క్రిస్టియన్ పీటర్సన్ X అకౌంట్లో దీని గురించి మరింత సమాచారం షేర్ చేసారు. దీనిని ఉపయోగించడానికి చాలా సులభం. వీచాట్ ద్వారా మని చెల్లించి వాడుకున్నానని చెప్పారు. మూత్ర విసర్జన తర్వాత నేను స్క్రీన్‌పై నా రిపోర్ట్స్  చూశాను, సంబంధిత ఫోటోను షేర్ చేసారు  అని  పేర్కొన్నాడు. షాంఘైలోని దాదాపు ప్రతి పురుషుల టాయిలెట్‌లో ఈ మెషిన్  చూడవచ్చు. 

ఒకసారి క్రిస్టియన్ పీటర్సన్‌ దానిని పరీక్షించగా కాల్షియం తక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక వారం తర్వాత, పాలు ఎక్కువగా తాగిన  తరువాత క్రిస్టియన్ పీటర్సన్ మళ్లీ పరీక్ష చేసుకున్నాడు. ఎలాంటి సమస్యా కనిపించలేదని చెప్పిన క్రిస్టియన్ పీటర్సన్.. ఇది చాలా బాగుందన్నారు. వ్యాధి ముదిరే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. 

దీనికి సంబంధించిన వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై ప్రజలు ఎన్నో  రకాల కామెంట్స్  చేశారు. గోప్యత గురించి కొందరు ప్రశ్నించగా, మరికొందరు అమెజాన్‌లో తక్కువ ధరకే కిట్‌  పొందవచ్చని, దానిని ఉపయోగించవచ్చని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios