Asianet News TeluguAsianet News Telugu

ఇప్పుడు మీరు YouTubeలో కూడా గేమ్స్ ఆడవచ్చు.. జస్ట్ ఈ ఒక్కటి చేస్తే చాలు..

ప్లేబుల్స్ ఫీచర్ సహాయంతో మీరు నేరుగా YouTubeలో వీడియో గేమ్స్  ఆడవచ్చు. Playables ఫీచర్ ప్రస్తుతం YouTube ప్రీమియం వినియోగదారులకు అంటే పెమెట్  యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
 

Playables Now you can play video games on YouTube also, know the method here-sak
Author
First Published Nov 29, 2023, 4:50 PM IST

మీరు గేమింగ్ కోసం మరే ఇతర యాప్స్  డౌన్‌లోడ్ చేయకూడదనుకుంటే, మీరు వీడియో గేమ్స్ ఆడటానికి ఇష్టపడితే మీకో గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు మీరు YouTubeలో హాయిగా వీడియో గేమ్స్  ఆడవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేయబుల్స్ అనే ఫీచర్‌ను యూట్యూబ్‌లో ప్రవేశపెట్టింది.

ప్లేబుల్స్ ఫీచర్ సహాయంతో మీరు నేరుగా YouTubeలో వీడియో గేమ్స్  ఆడవచ్చు. Playables ఫీచర్ ప్రస్తుతం YouTube ప్రీమియం వినియోగదారులకు అంటే పెమెట్  యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

YouTube ప్లేబుల్స్ ఎలా ఉపయోగించాలి?
అన్నింటిలో మొదటిది, ప్లేబుల్స్ సహాయంతో మీరు ఏదైనా గేమ్‌ని ఇన్స్టంట్ ఆడవచ్చు. ఇందుకు మీరు గేమ్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ కింద యూజర్లు  అనేక రకాల వీడియో గేమ్స్ కి ఆక్సెస్ పొందుతారు. ప్లేబుల్స్ ఫీచర్ ప్రస్తుతం ప్రీమియం వినియోగదారుల కోసం టెస్టింగ్ మోడ్‌లో ఉంది ఇంకా మార్చి 2024 వరకు అమలులో ఉంటుంది. త్వరలో అందరికి విడుదల చేయవచ్చు.

ప్లేబుల్స్ ఫీచర్ కింద, బ్రెయిన్ అవుట్ అండ్  డైలీ క్రాస్‌వర్డ్ వంటి లైట్ గేమ్‌లతో పాటు యూజర్లు స్కూటర్ ఎక్స్‌ట్రీమ్ అండ్  కానన్ బాల్స్ 3D వంటి యాక్షన్ గేమ్‌లను కూడా ఆడవచ్చు.

మీకు YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌  ఉన్నట్లయితే, మీరు YouTube యాప్ లేదా వెబ్ వెర్షన్‌లోని ప్రొఫైల్ విభాగానికి వెళ్లడం ద్వారా బెనిఫిట్స్ లో ప్లేబుల్స్‌ని చెక్  చేయవచ్చు. మీరు "మీ ప్రీమియం బెనిఫిట్స్" విభాగానికి వెళ్లడం ద్వారా గేమ్స్ చూడవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios