Asianet News TeluguAsianet News Telugu

అనుకున్నదే అయ్యింది.. ఇప్పుడు వాట్సాప్ ఫీచర్ పై చార్జెస్.. నెలకి ఎంతంటే..?

ఈ ఏడాది నుండి అంతా మారనుంది. 2024 మొదటి ఆరు నెలల్లో WhatsApp చాట్ బ్యాకప్‌లు వినియోగదారుల Google డిస్క్ స్టోరేజ్ కి లిమిట్కి చేయబడుతుంది. ఈ చర్య 15 GBపై ఆధారపడే వారిపై ప్రభావం చూపుతుంది. అంటే Google డిస్క్‌లో ప్రత్యేక ఫోటోలు, వీడియోలు ఇంకా  చాట్‌లను సురక్షితంగా ఉంచుకునే వ్యక్తులు ఇప్పుడు WhatsApp కోసం Google Oneతో అదనపు స్టోరేజ్ కొనుగోలు  చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Now there is a fee to use WhatsApp.. What do you say? Mobile users shocked.!!-sak
Author
First Published Jan 9, 2024, 7:10 PM IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఇక నుంచి వాట్సాప్‌ను వినియోగించుకుంటే చార్జీలు వసూలు చేయనున్నారు. WhatsApp అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల  కొద్దీ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఫ్రీ మెసేజింగ్  సర్వీస్ యాప్. ఇప్పుడు దీనిని ప్రతిఒక్కరు  ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ వాట్సాప్‌లో చాట్ చేసుకుంటుంటారు. దీని ద్వారా వినియోగదారులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఫోటోలు, వీడియోలు ఇంకా డేటాను షేర్ చేయడానికి కూడా  వాట్సాప్‌ సహాయపడుతుంది. వాట్సాప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఖచ్చితంగా  ఉండే యాప్ గా మారింది. అయితే కొన్నేళ్లుగా, యూజర్లు   వాట్సాప్ చాట్‌ను ఎటువంటి చార్జెస్ లేకుండా  Google డ్రైవ్  డిస్క్‌కి బ్యాకప్ చేసుకోవడానికి Google అనుమతించింది.

అయితే ఈ ఏడాది నుండి అంతా మారనుంది. 2024 మొదటి ఆరు నెలల్లో WhatsApp చాట్ బ్యాకప్‌లు వినియోగదారుల Google డిస్క్ స్టోరేజ్ కి లిమిట్కి చేయబడుతుంది. ఈ చర్య 15 GBపై ఆధారపడే వారిపై ప్రభావం చూపుతుంది. అంటే Google డిస్క్‌లో ప్రత్యేక ఫోటోలు, వీడియోలు ఇంకా  చాట్‌లను సురక్షితంగా ఉంచుకునే వ్యక్తులు ఇప్పుడు WhatsApp కోసం Google Oneతో అదనపు స్టోరేజ్ కొనుగోలు  చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Google One అండ్ Google Drive సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ప్రతినెలా ఇంకా అన్యువల్  ప్రాతిపదికన మూడు ప్లాన్‌లను అందిస్తాయి. ప్రతినెల  ప్లాన్ బేసిక్ (100GB) £1.59 / $1.99, స్టాండర్డ్ (200GB) £2.49 / $2.99 ​, ప్రీమియం (2TB) £7.99 / $9.99. ఈ ప్లన్స్  ప్రతినెల  ప్రాతిపదికన ఉంటాయి.

భారతదేశంలో  వీటి ధర ఇంకా ప్రకటించబడలేదు. యూజర్ల  ఫోన్ నంబర్లను బహిర్గతం చేయకుండా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేలా కొత్త ఫీచర్‌పై వాట్సాప్ కూడా పనిచేస్తోందని సమాచారం. అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు, అయితే ఈ ఏడాది ఈ ఫీచర్ రావచ్చని అంచనా.

Follow Us:
Download App:
  • android
  • ios