100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్లతో బడ్జెట్ ధరకే కొత్త స్మార్ట్‌వాచ్.. 20 నిమిషాల ఛార్జింగ్‌తో వన్ డే బ్యాకప్
మాక్సిమా మ్యాక్స్ ప్రో వైబ్ స్మార్ట్‌వాచ్ బ్లాక్, పింక్, గోల్డ్ పీచ్ అండ్ సిల్వర్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. దీని ధర రూ.1899. ఈ వాచ్ ని కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి ఇంకా ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
మాక్స్ ప్రో సిరీస్ విస్తరిస్తూ భారతీయ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ మాక్సిమా కొత్త స్మార్ట్‌వాచ్ మ్యాక్సిమా మ్యాక్స్ ప్రో వైబ్‌ను ప్రవేశపెట్టింది. ఈ వాచ్‌లో 1.69-అంగుళాల ఫుల్ టచ్ డిస్ప్లే, 550 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. అలాగే మూవ్-రిస్ట్-టు-వేక్-స్క్రీన్ ఫంక్షన్‌తో కొత్త ఎడిషన్ కెపాసిటివ్ టచ్ కూడా ఈ వాచ్‌లో ఇచ్చారు. 100 కంటే ఎక్కువ క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేసెస్, బ్లూటూత్ 5 వాచ్‌తో సపోర్ట్ చేస్తాయి.
మాక్సిమా మ్యాక్స్ ప్రో వైబ్ ధర
మాక్సిమా మ్యాక్స్ ప్రో వైబ్ స్మార్ట్‌వాచ్ బ్లాక్, పింక్, గోల్డ్ పీచ్ అండ్ సిల్వర్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. దీని ధర రూ.1899. ఈ వాచ్ ని కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి ఇంకా ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషషన్స్
మాక్స్ ప్రో వైబ్ స్మార్ట్‌వాచ్ 240x280 పిక్సెల్‌ల రిజల్యూషన్, 550 నిట్స్ బ్రైట్ నెస్ తో 1.69-అంగుళాల పూర్తి టచ్ డిస్ప్లే, రన్నింగ్, వాకింగ్, యోగా వంటి 100కి పైగా స్పోర్ట్స్ మోడ్లు వాచ్‌లో ఉన్నాయి. అలాగే, వాచ్‌లో SpO2 మానిటర్‌తో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సులభంగా ట్రాక్ చేయవచ్చు. స్మార్ట్ వాచ్ లేటెస్ట్ హార్ట్ బీట్ రేటు HRS3300 సెన్సార్లతో వస్తుంది, ఇది హార్ట్ బీట్ ని ట్రాక్ చేస్తుంది.
మ్యాక్స్ ప్రో వైబ్‌లో 100 కంటే ఎక్కువ క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ ఉంది. దీనితో పాటు యూజర్లు గ్యాలరీ ఫోటోలను వాచ్ ఫేస్‌లో సెట్ చేసుకునే ఆప్షన్ కూడా పొందుతారు. మాక్స్ ప్రో వైబ్ లో ఎక్స్ టెండెడ్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో ఒక రోజు పాటు బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5కి సపోర్ట్ చేస్తుంది.
మ్యాక్స్ ప్రో వైబ్లోని ఇతర కనెక్టివిటీ ఫీచర్లలో వాతావరణ అప్డేట్లు, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్స్, అలారం, స్టాప్‌వాచ్, టైమర్, కాలిక్యులేటర్, స్లీప్ అండ్ క్యాలరీల మానిటర్, డిస్టెన్స్ ట్రాకర్, ఇన్కమింగ్ కాల్ నోటిఫికేషన్లు, డ్రింకింగ్ అండ్ సెడెంటరీ రిమైండర్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్ ఉన్నాయి. అలాగే, వాటర్ రెసిస్టెంట్ కోసం వాచ్ 3ATM రేటింగ్‌ను కూడా పొందింది.