ప్రపంచంలోనే అతిపెద్ద డిస్‌ప్లేతో ఆసుస్ ల్యాప్‌టాప్.. దీనిని పుస్తకంల కూడా మడతపెట్టవచ్చు..
దీనికి టచ్‌ప్యాడ్‌తో పాటు ఆసుస్ ErgoSense బ్లూటూత్ కీబోర్డ్ లభిస్తుంది. ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడి ధర రూ.3,29,990. ఈ ల్యాప్‌టాప్‌ను మడతపెట్టి కూడా ఉపయోగించవచ్చు.
తైవానిస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్ ఎట్టకేలకు ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడి ల్యాప్‌టాప్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డిస్‌ప్లే ల్యాప్‌టాప్. జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLEDతో 17.3-అంగుళాల స్క్రీన్ అంతేకాకుండా ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ కూడా ఉంది.
దీనికి టచ్‌ప్యాడ్‌తో పాటు ఆసుస్ ErgoSense బ్లూటూత్ కీబోర్డ్ లభిస్తుంది. ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడి ధర రూ.3,29,990. ఆసుస్ స్టోర్‌లలో కాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్, క్రోమా అండ్ రిలీయన్స్ డిజిటల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.
అసూస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడి స్పెసిఫికేషన్లు
అసూస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED 12th జెన్ ఇంటెల్ కోర్ i7-1250U CPUని 16జిబి LPDDR5 ర్యామ్ తో పాటు 1టిబి M.2 NVMe PCIe 4.0 స్టోరేజ్ పొందుతుంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్‌తో వస్తుంది, అయితే దీనికి ప్రత్యేక గ్రాఫిక్స్ ఏవీ లభించవు. Thunderbolt 4 అండ్ వై-ఫై 6ఈ కూడా ఉంది.
జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLEDకి 17.3-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే ఇచ్చారు, ఈ డిస్ ప్లే OLED ఇంకా దీని రిజల్యూషన్ 2.5K. డిస్‌ప్లే గరిష్ట బ్రైట్ నెస్ 350 నిట్‌లు. ఈ ల్యాప్‌టాప్‌ను మడతపెట్టి కూడా ఉపయోగించవచ్చు. మడతపెట్టిన తర్వాత 12.5-అంగుళాల స్క్రీన్ ఉంటుంది.
డిస్ ప్లేతో పాటు యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కూడా ఉంది. జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLED డాల్బీ అట్మోస్‌తో పాటు హర్మాన్ కార్డాన్ క్వాడ్ స్పీకర్‌తో వస్తుంది. ఇందులో AI సపోర్ట్‌తో కూడిన వెబ్‌క్యామ్ కూడా ఉంది. ఈ Asus ల్యాప్‌టాప్ బరువు 1.5 కిలోలు.