8జిబి ర్యామ్ , 50ఎంపి కెమెరాతో పవర్ ఫుల్ ఫోన్.. తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లు.. నేడే లాంచ్..
ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ బ్లాక్, బ్లూ, పర్పుల్ అండ్ వైట్ కలర్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ తో 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. ఫోన్ ధర PHP 8,499 అంటే సుమారు రూ. 12,000.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ ను లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ మొదట ఫిలిప్పీన్స్‌లో ప్రవేశపెట్టారు. మీడియా టెక్ జి96 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఫోన్‌లో అందించారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ సపోర్ట్ ఇచ్చారు. ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేతో వస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ ధర
ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ బ్లాక్, బ్లూ, పర్పుల్ అండ్ వైట్ కలర్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ తో 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. ఫోన్ ధర PHP 8,499 అంటే సుమారు రూ. 12,000. ఈ ఫోన్ డిసెంబర్ 1న అంటే నేడు ఇండియాలో లాంచ్ అవుతుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ స్పెసిఫికేషన్లు
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్‌లో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ IPS TFT డిస్‌ప్లే, (1,080X2,460 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కంపెనీ దీనిని హైపర్‌విజన్ గేమింగ్-ప్రో డిస్‌ప్లే అని పిలుస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G96 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్ తో 128 జిబి స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 512 జిబి వరకు పెంచుకోవచ్చు. సెక్యూరిటి కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ కెమెరా
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ లో చూడవచ్చు, దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్. దీనితో పాటు మరో రెండు కెమెరా సెన్సార్లు 2 మెగాపిక్సెల్స్, బ్యాక్ కెమెరాతో క్వాడ్ ఫ్లాష్ సపోర్ట్ ఉంది. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇంకా డ్యూయల్ LEDతో వస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 20ఎస్ బ్యాటరీ
ఈ Infinix ఫోన్ లో 5,000mAh బ్యాటరీ ఉంది, ఇంకా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 4G, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్ అండ్ GPS సపోర్ట్ ఉంది.