రూ.1,500 లోపు బెస్ట్ బడ్జెట్ ఇయర్‌బడ్స్ ఇవే.. గొప్ప సౌండ్ ఇంకా లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో..

మొదట్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల ధర చాలా ఎక్కువ. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి సౌండ్ క్వాలిటీతో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. 

Best Earbuds with great sound and long battery life cost less than Rs 1,500

ఈ రోజుల్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను చాలా ఇష్టపడుతున్నారు. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు స్టైలిష్‌గా ఉండటమే కాకుండా మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. మొదట్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల ధర చాలా ఎక్కువ. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి సౌండ్ క్వాలిటీతో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. మీరు కూడా తక్కువ ధరలో మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల కోసం చూస్తున్నారా... రూ.1,500 కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఇయర్‌బడ్‌ల గురించి తెలుసుకొండి...

మివీ డుయో పాడ్స్ ఎఫ్ 40 
మివీ డుయో పాడ్స్ ఎఫ్40ని వైట్, బ్లాక్, గ్రీన్, బ్లాక్ ఇంకా నీలం కలర్స్ లో లాభిస్తుంది, వీటి ధర రూ. 999. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌లో 13ఎం‌ఎం ఎలక్ట్రో డైనమిక్ డ్రైవర్ ఉంది. Mivi DuoPods F40 బ్యాటరీకి సంబంధించి వన్-టైమ్ ఛార్జింగ్‌తో 50 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. కంపెనీ ప్రకారం, 70% చార్జింగ్ తో 50 గంటల బ్యాకప్ ఉంటుంది. గేమింగ్ కోసం Mivi DuoPods F40లో లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. 

బోట్ ఎయిర్‌డోల్ ఆటమ్ 81 
బోట్ నుండి వస్తున్న ఈ ఇయర్‌బడ్‌లను రూ.1,399కే కొనుగోలు చేయవచ్చు. ఇయర్‌బడ్‌లలో 13ఎం‌ఎం డ్రైవర్లు, 50 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. బడ్స్‌తో 50ms సూపర్ లో లేటెన్సీ సపోర్ట్ అందించారు, ఇంకా గేమింగ్ అనుభవాన్ని ఎక్కువ రెట్లు మెరుగుపరుస్తుంది. ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ v5.3కి సపోర్ట్‌ చేస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్‌కు సపోర్ట్‌ ఉంది.

నాయిస్ బడ్స్ VS303 
నాయిస్ ఇయర్‌బడ్‌లను రూ. 1,399 ధరకు కొనుగోలు చేయవచ్చు. నాయిస్ బడ్స్ VS303లో  13mm డ్రైవర్ ఇచ్చారు. కంపెనీ  హైపర్ సింక్ టెక్నాలజీ ఇయర్‌బడ్స్‌లో ఇచ్చింది. ఇంకా బెస్ట్ ఆడియో, స్పష్టమైన వాయిస్‌ని క్లెయిమ్ చేస్తుంది. ఈ ఇయర్‌బడ్‌లు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5 ఇందులో ఇచ్చారు. అంతేకాకుండా, AAC అండ్ SBC బ్లూటూత్ కోడెక్‌లకు కూడా సపోర్ట్ ఉంది. 

ptron బేస్ బడ్స్ వేవ్
ఈ ptron ఇయర్‌బడ్స్ ధర రూ. 1,299. ఈ ఇయర్‌బడ్‌లు మోనో ఇంకా డ్యూయల్ బడ్స్ రెండింటికీ సపోర్ట్‌తో 8mm డైనమిక్ డ్రైవర్‌ అందించారు. దీనిలో సినిమాల కోసం 50ms లో లేటెన్సీ మోడ్ ఇంకా ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)కి సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం  బ్లూటూత్ v5.3 ఉంది, అలాగే  ఫోన్ నుండి 10 మీటర్ల  వరకు  పనిచేస్తుంది. ఈ  బడ్స్‌ 40 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios