Asianet News TeluguAsianet News Telugu

మీరు స్మార్ట్ వాచ్ కొనబోతున్నారా..? రూ.1,500 నుండి రూ.5,000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లపై ఒక లిక్కెయండి..?

మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలని ఆలోచిస్తున్నారా..? లేదా మీ ఇష్టమైన వారికి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే మీరు బడ్జెట్ ధరకే  రూ. 1,500 నుండి రూ. 5,000 మధ్య బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి మీకోసం...
 

Are you going to buy a smartwatch..? these are Best Smartwatches from Rs.1,500 to Rs.5,000-sak
Author
First Published Mar 11, 2023, 6:24 PM IST | Last Updated Mar 11, 2023, 6:24 PM IST

మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలని ఆలోచిస్తున్నారా..? లేదా మీ ఇష్టమైన వారికి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే మీరు బడ్జెట్ ధరకే  రూ. 1,500 నుండి రూ. 5,000 మధ్య బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల గురించి మీకోసం...

నాయిస్ కలర్ ఫిట్ ప్రొ 4
ధర: రూ. 2,999
మీకు స్మార్ట్‌గా కనిపించే స్మార్ట్ వాచ్ కావాలంటే మీ బడ్జెట్‌లో నాయిస్ కలర్ ఫిట్ ప్రొ 4ని చూడండి. ఈ వాచ్ 8 విభిన్న కలర్స్ లో వస్తుంది. వీటిలో డీప్ వైన్ కలర్ మోడల్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మెసేజెస్ అండ్ ఇతర వివరాలను ఈజీగా చదవడానికి మంచి డిస్ ప్లే అందించారు. మీరు వాచ్ ఫెసెస్ మార్చవచ్చు ఇంకా స్మార్ట్ వాచ్ నుండి నేరుగా వాయిస్ కాల్స్ పొందవచ్చు దానికి అనుగుణంగా మంచి స్పీకర్ అండ్ మైక్రోఫోన్ కూడా ఉంది.

ఫైర్‌బోల్ట్ రాకెట్
ధర: రూ. 2,499
మీరు వృత్తాకార ఆకారంతో వాచ్ కోసం చూస్తున్నట్లయితే, మీరు ఫైర్‌బోల్ట్ రాకెట్‌ను పరిగణించవచ్చు. ఈ వాచ్ చేతికి గొప్పగా అనిపిస్తుంది ఇంకా ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. దీనికి FHD డిస్ ప్లే ఉంది. ఎండలో ఇంటి లోపల లేదా బయట డిస్ ప్లే తగినంత ప్రకాశవంతంగా ఉంటుంది. 

ఈ వాచ్  హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ టైమ్ మానిటరింగ్, ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్,  మెన్స్ ట్రుయల్ సైకిల్ మానిటరింగ్ వంటి 100 కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. IP67 రేటింగ్‌తో, వాచ్‌పై  వర్షం, మంచు బిందువులు లేదా నీటి బిందువులు పడిన  ప్రభావం ఉండదు. మీ ఫోన్ అందుబాటులో లేనప్పుడు మీరు మీ మెసేజెస్ లేదా ఫోన్  నోటిఫికేషన్‌లను చెక్ చేయవచ్చు. కానీ మీరు కాల్స్ చేయలేరు, ఎవరు కాల్ చేస్తున్నారో మాత్రమే మీరు చెక్ చేయవచ్చు.

సెన్స్ ఎడిసన్ 1
ధర: రూ. 1,699
సెన్స్ ఎడిసన్ 1 బ్లూటూత్ కాల్ సపోర్ట్‌తో వస్తున్న బడ్జెట్ వాచ్. మీలో చాలామంది సెన్స్ కంపెనీ గురించి విని ఉండకపోవచ్చు ఎందుకంటే భారతదేశంలో స్మార్ట్ వాచ్‌లను తయారు చేసే కొత్త కంపెనీ. కానీ ఈ స్మార్ట్ వాచ్ మంచి పర్ఫర్మెంస్ ఉందని చెప్పబడింది.  

మీ హార్ట్ బీట్ రేటు, ఆక్సిజన్ లెవెల్,  స్లీప్ స్ట్రైకింగ్ బేసిక్ ఔట్ డోర్ ఆక్టివిటీస్ ట్రాక్ చేయగలదు. డిస్ ప్లే గొప్పగా అనిపించకపోయిన తగినంత బ్రైట్ నెస్ ఉంటుంది. మీరు ఈ వాచ్‌ని మీ ఫోన్‌కి కనెక్ట్ చేసిన తర్వాత, మీరు మెసేజెస్ చదవవచ్చు, కాల్‌లు చేయవచ్చు ఇంకా కాల్స్ లో చేరవచ్చు. అలాగే, దాని మైక్ సౌండ్ అధికంగా అలాగే స్పష్టంగా ఉంటుంది. కాబట్టి, ఓవరాల్‌గా రూ. 1,700కి మంచి వాచ్ అని చెప్పవచ్చు.

రియల్ మీ టెక్ లైఫ్ వాచ్ R100
ధర: రూ. 3,999
రియల్ మీ టెక్ లైఫ్ వాచ్  R100 ధర కేవలం రూ. 4,000. ఈ బడ్జెట్‌లో వాయిస్ కాల్స్ తో కూడిన మంచి స్మార్ట్‌వాచ్ ఇదే. మైక్రోఫోన్ మంచి క్వాలిటీతో వస్తుంది. అలాగే, కాల్ వచ్చినప్పుడు స్పీకర్ చాలా గట్టిగా వినిపిస్తుంది. 

వన్‌ప్లస్ నోర్డ్ వాచ్
ధర: రూ. 4,999
చివరగా వన్‌ప్లస్ నోర్డ్ వాచ్‌ను పరిగణనలోకి తీసుకోవడం కూడా మీ డబ్బుకి వాల్యు ఇస్తుంది. మీరు ఈ వాచ్‌లో నేరుగా కాల్స్ కి సమాధానం ఇవ్వలేరు. మీరు మెసేజెస్ చెక్ చేయవచ్చు ఇంకా కాల్ వస్తుందో లేదో చూడవచ్చు.  దీనికి గొప్ప AMOLED డిస్‌ప్లే ఇంకా మంచి టచ్ రెస్పాన్స్‌  ఉంది. ఇతర బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ల కంటే మెరుగైనది. దీని బ్యాటరీ లైఫ్ కూడా పటిష్టంగా ఉంటుంది ఇంకా ఒక ఛార్జ్‌పై ఒక వారం కంటే ఎక్కువ ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios