Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ప్రైమ్ మెంబర్‌షిప్ ధర తగ్గింపు..

ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్రయోజనాల్లో కూడా అమెజాన్ కొన్ని మార్పులు చేసింది. Amazon Prime Lite మెంబర్‌షిప్ వినియోగదారులకు Amazon నుండి వేగవంతమైన ఉచిత డెలివరీని అందిస్తుంది. అలాగే ఉచిత డెలివరీ కోసం కనీస ఆర్డర్ అవసరం లేదు. 

Amazon with discount for Prime membership; This is the purpose of the rate reduction-sak
Author
First Published Dec 22, 2023, 5:58 PM IST

ఓటిటి ఫ్లాట్ ఫార్మ్, స్ట్రీమింగ్ సర్వీస్  అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రేట్లను తగ్గించింది. అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ఇప్పుడు రూ.999 నుండి రూ.799 తగ్గింది  అంటే రూ.200 తగ్గించింది. ప్రైమ్ ప్లాన్ ధరలను ఒక నెల సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 299, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 599, ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌కు రూ. 1,499గా ఎలాంటి  మార్పు  లేకుండా అమెజాన్ నిర్ణయించింది. 
 
ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్రయోజనాల్లో కూడా అమెజాన్ కొన్ని మార్పులు చేసింది. Amazon Prime Lite మెంబర్‌షిప్ వినియోగదారులకు Amazon నుండి వేగవంతమైన ఉచిత డెలివరీని అందిస్తుంది. అలాగే ఉచిత డెలివరీ కోసం కనీస ఆర్డర్ అవసరం లేదు. సాధారణ ప్రైమ్ యూజర్ల లాగానే  అమెజాన్ ప్రైమ్ లైట్ కస్టమర్‌లు కూడా ఎటువంటి రద్దీ లేని డెలివరీని సెలెక్ట్ చేసుకుంటే రూ.25 క్యాష్‌బ్యాక్‌కు అర్హులు. అలాగే ప్రైమ్ మ్యూజిక్ ఇప్పటికీ ఆఫర్‌లో చేర్చలేదు. 

 అయితే ప్రైమ్ లైట్ కస్టమర్‌లు అమెజాన్ లైట్నింగ్ డీల్‌లు ఇంకా ప్రైమ్ కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే డీల్‌లకు ముందస్తు యాక్సెస్‌ను కూడా పొందుతారు.

ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ స్ట్రీమింగ్ డివైజెస్  సంఖ్యను లిమిట్ చేస్తూ భారతదేశం అంతటా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆన్  లిమిటెడ్ వీడియోలు, సినిమాలు, టీవీ షోలను ప్రసారం చేయడానికి సహాయపడుతుంది. HD క్వాలిటీలో  రెండు డివైజెస్  మాత్రమే అనుమతిస్తాయి. ప్రైమ్ లైట్ కస్టమర్‌లు అమెజాన్ ప్రైమ్ రీడింగ్ అండ్ ప్రైమ్ గేమింగ్ సర్వీసెస్ కి  యాక్సెస్ పొందలేరు. 

Follow Us:
Download App:
  • android
  • ios