యూజర్లకు షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధరల బాదుడు..

అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ ధర ఇప్పటికీ రూ. 1,499 అంటే ఏడాది ప్లాన్ ధర పెరగలేదు. ప్రతినెల, 3 నెలల ప్లాన్‌ల ధరలు చూస్తే ఒక నెల ప్లాన్  రూ.120, 3 నెలల ప్లాన్ ధర రూ.140 పెరిగాయి. కంపెనీ ప్లాన్‌లలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద పెరుగుదల.
 

Amazon Prime gave a  big  shock, prime membership plans costlier by up to 67%-sak

మీరు కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు.. అయితే మీకో  బ్యాడ్ న్యూస్. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్ ధరలను అమెజాన్ పెంచింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇప్పుడు భారతదేశంలో 67 శాతం వరకు పెరిగింది. దింతో  అమెజాన్ ప్రైమ్ ప్రతినెల ఇంకా మూడు నెలల ప్లాన్‌ల ధరలు పెరిగాయి. అయితే అమెజాన్ ప్రైమ్ కొత్త ధరలను తెలుసుకుందాం... 

అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ ధర ఇప్పటికీ రూ. 1,499 అంటే ఏడాది ప్లాన్ ధర పెరగలేదు. ప్రతినెల, 3 నెలల ప్లాన్‌ల ధరలు చూస్తే ఒక నెల ప్లాన్  రూ.120, 3 నెలల ప్లాన్ ధర రూ.140 పెరిగాయి. కంపెనీ ప్లాన్‌లలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద పెరుగుదల.

ప్లాన్ ధరల సమాచారం అమెజాన్ సపోర్ట్ పేజీలో కూడా అప్‌డేట్ చేసింది. ఇప్పుడు భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ ఒక నెల మెంబర్‌షిప్ రూ. 299, మూడు నెలల మెంబర్‌షిప్ రూ. 599. ఇంతకుముందు ఈ రెండు ప్లాన్‌ల ధరలు చూస్తే ఒక నెల ప్లాన్ ధర రూ. 179, 3 నెలల ప్లాన్ ధర రూ. 459గా ఉండేది.

ప్లాన్ ధరలు పెరిగినప్పటికీ  కానీ బండిల్ చేసిన బెనిఫిట్స్ మారవు, అయినప్పటికీ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారు 30 నిమిషాల ప్రీ  యాక్సెస్‌ పొందుతారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 2016లో ఇండియాలో ప్రారంభించారు.

మీరు తక్కువ ధరలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలనుకుంటే కంపెనీకి ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ కూడా ఉంది. ఈ ప్లాన్ కింద, ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ రూ. 999కి లభిస్తుంది. ఈ ప్లాన్‌తో  రెండు రోజుల ఉచిత డెలివరీ ఉంటుంది. దీనితో పాటు వీడియో కంటెంట్‌కు యాక్సెస్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో యాడ్స్ చూడవలసి ఉంటుంది ఇంకా SD క్వాలిటీ కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios