Asianet News TeluguAsianet News Telugu

ఆకాశంలో అందమైన 'క్రిస్మస్ చెట్టు'.. భూమికి 2500 కాంతి సంవత్సరాల దూరంలో..

NASA ఒక క్రిస్మస్ చెట్టులా కనిపించే నక్షత్ర వ్యవస్థ(star system) NGC 2264 ఫోటోని షేర్ చేసింది. ఆకుపచ్చ, నీలం ఇంకా  తెలుపు వంటి అనేక రంగులలో ఈ రాశి(constellation) క్రిస్మస్ చెట్టులా కనిపిస్తుంది.

A beautiful 'Christmas tree' 2500 light years away from Earth!-sak
Author
First Published Dec 22, 2023, 3:34 PM IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చాలా అందమైన క్రిస్మస్ చెట్టు ఫోటోని షేర్ చేసింది. ఈ చెట్టు భూమి నుండి దాదాపు 2500 కాంతి సంవత్సరాల( light years) దూరంలో ఉంది.

NASA ఒక క్రిస్మస్ చెట్టులా కనిపించే నక్షత్ర వ్యవస్థ(star system) NGC 2264 ఫోటోని షేర్ చేసింది. ఆకుపచ్చ, నీలం ఇంకా  తెలుపు వంటి అనేక రంగులలో ఈ రాశి(constellation) క్రిస్మస్ చెట్టులా కనిపిస్తుంది. క్లస్టర్‌లోని కొన్ని నక్షత్రాలు చిన్నవిగా ఉంటాయి. కొన్ని సాపేక్షంగా పెద్దవి. అంటే సూర్యుని ద్రవ్యరాశికి పదో వంతు నుండి ఏడు రెట్ల వరకు ఉండే నక్షత్రాలు.

వివిధ టెలిస్కోప్‌ల నుండి సమాచారాన్ని కలపడం ద్వారా ఈ ఫోటోని  రూపొందించారు. నీలం ఇంకా తెలుపు నక్షత్రాలను నాసా   చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ(Chandra X-ray Observatory) బంధించింది. ఈ ఆకుపచ్చ రంగులోని బ్యాక్ గ్రౌండ్  నుబుల(nebula). దీనిని కిట్ పీక్ అబ్జర్వేటరీ వద్ద WIYN 0.9m టెలిస్కోప్ ద్వారా తీశారు. తెల్లని నక్షత్రాలు రెండు మైక్రోన్ ఆల్ స్కై సర్వే నుండి, ఫోటో  క్రిస్మస్ చెట్టులా కనిపించడానికి క్లాక్ వైస్ లో సుమారు 160 డిగ్రీలు తిప్పారు.

ఈ రాశి(constellation)లో సాపేక్షంగా యువ నక్షత్రాలు ఉన్నాయి. వీటి  వయస్సు 10 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉంటుంది. ఈ నక్షత్ర గ్రూప్ ఇప్పటికీ బిలియన్ల సంవత్సరాల వయస్సు గల అలాగే  వాటి ముగింపుకు చేరువలో ఉన్న ఇతర నక్షత్రాలతో పోలిస్తే సుదీర్ఘ జీవితకాలంతో ఉన్నాయి. కానీ క్రిస్మస్ ట్రీ క్లస్టర్ నక్షత్రాలను మన కళ్ళతో మాత్రం చూడలేము. 

 

Follow Us:
Download App:
  • android
  • ios