Asianet News TeluguAsianet News Telugu

మీరు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనడానికి 3 కారణాలు.. ఫీచర్స్, ఎక్కువ ధర దేనికంటే..

OnePlus 12 Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Qualcomm లేటెస్ట్  హై-ఎండ్  ఉపయోగిస్తున్నందున, ఈ చిప్‌సెట్ 2024లో అన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను బీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. 

3 reasons why you should be excited for OnePlus 12-sak
Author
First Published Dec 4, 2023, 2:31 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ (OnePlus )12 డిసెంబర్ 5న చైనా లాంచ్ షెడ్యూల్‌తో కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. భారతదేశంతో సహా గ్లోబల్ రోల్ అవుట్ జనవరి 23 లేదా 24న అంచనా వేయవచ్చు. అయితే, సంస్థ ఇప్పటికే దీని హై లెట్ ఫీచర్స్  వెల్లడించింది. రాబోయే OnePlus ఫోన్  టీజర్‌లు ఖచ్చితంగా OnePlus 12 కంటే  ముందున్న OnePlus 11 కంటే చాలా ఖరీదైనదిగా   సూచిస్తున్నాయి. 

చిప్‌సెట్: 

OnePlus 12 Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Qualcomm లేటెస్ట్  హై-ఎండ్  ఉపయోగిస్తున్నందున, ఈ చిప్‌సెట్ 2024లో అన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను బీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. చాల వరకు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు  అల్ట్రా-ప్రీమియం డివైజెస్ లో టాప్-టైర్ చిప్‌లను సెలెక్ట్ చేసుకుంటుంటాయి, Snapdragon 8 Gen 3  ఇంటిగ్రేషన్  ఇతర హై-ఎండ్ కాంపోనెంట్‌లతో పాటు OnePlus 12 ధరల  పెరుగుదలకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

వైర్‌లెస్ ఛార్జింగ్:

OnePlus 12లో వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలు కన్ఫర్మ్ చేసింది, అయినప్పటికీ ఈ ఫోన్ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ధరలను పోటీగా ఉంచడానికి ఈ ఫీచర్‌ని OnePlus ఓపెన్‌లో అందించడం గమనార్హం. OnePlus 8 ప్రోతో వైర్‌లెస్ ఛార్జింగ్‌ను మొదటిసారిగా OnePlus పరిచయం చేసింది. OnePlus 12లో వైర్‌లెస్ ఛార్జింగ్ తిరిగి రావడం స్వాగతించదగినది, అయితే  మొత్తం ధరపై సాధ్యమయ్యే ప్రభావం గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది.

అద్భుతమైన కెమెరా: 

కొత్తగా లీక్ అయిన OnePlus సమాచారం ప్రకారం, OnePlus 12 బ్రాండ్  అత్యంత ఖరీదైన ఫోన్ అయిన OnePlus Openలగే అదే కెమెరా సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. భారతదేశంలో OnePlus ఓపెన్ ధర రూ.1,39,999. సంస్థ రాబోయే ఫ్లాగ్‌షిప్ మెరుగైన ఫోటోగ్రఫీ సామర్థ్యాలను కూడా నొక్కి చెబుతోంది, కెమెరా టెక్నాలజీలో ఈ పురోగతులు వన్‌ప్లస్ 12 కోసం అంచనా వేసిన ధరల పెరుగుదలకు దోహదపడతాయని సూచిస్తుంది.

సామ్‌సంగ్, గూగుల్ అండ్ ఆపిల్ వంటి కంపెనీలు మెరుగైన ఫీచర్లు, అత్యుత్తమ పర్ఫార్మెన్స్  అందించడానికి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను స్థిరంగా పెంచాయి.

Follow Us:
Download App:
  • android
  • ios