Asianet News TeluguAsianet News Telugu

టాక్ నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల ను నియమితులయ్యారు.

Telangana Association of United Kingdom New President Ratnakar Kadudula
Author
Hyderabad, First Published Mar 25, 2021, 11:12 AM IST

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల ను నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

ఉద్యమ సమయం నుండి నేటి వరకు రత్నాకర్ ఎన్నో బాధ్యతల్లో వివిధ ప్రవాస సంఘాల్లో పని చేసారాని, విదేశాల్లో మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమాలే కాకుండా స్థానికంగా మరియు తెలంగాణ లోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో చారిటి - సేవా కార్యక్రమాలు చేశారని అనిల్ అన్నారు. టాక్ అధ్యక్షుడిగా మరెన్నో మంచి  కార్యక్రమాలు చేస్తూ, ప్రవాసులు అండగా నిలుస్తూ,  సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్టు అనిల్ తెలిపారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు పనిచేసిన కార్యవర్గ సభ్యులందరినీ అనిల్ అభినందించారు. టాక్ సంస్థని ప్రపంచంలో ఒక అత్యుత్తమ ప్రవాస సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన వారందరికీ  కృతజ్ఞతాభినందనాలు తెలియజేసారు అనిల్. సంస్థ ఆవిర్భావం నుండి ప్రత్యేక సలహాదారులుగా ఉంటూ ఎన్నో సలహాలు సూచనలు అందజేసిన నందిని సిద్దా రెడ్డి గారికి మరియు కట్టా శేఖర్ రెడ్డి గారికి కూడా కృతఙ్ఞతలు తెలియయజేశారు.

అలాగే టాక్ సంస్థను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకి కూడా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా నేటి వరకు టాక్ సంస్థను ప్రోత్సహిస్తూ ముందుకు తీసికెళ్ళిన యూకే లోని ప్రవాసులకి అలాగే వివిధ సందర్భాల్లో ప్రోత్సాహాన్ని అందించిన ప్రపంచవ్యాప్త వివిధ ప్రవాస సంఘాలకి  కృతఙ్ఞతలు తెలియజేసారు.

 భవిష్యత్తులో కూడా నూతన నాయకత్వానికి సైతం అదే ప్రోత్సాహాన్ని సహకారాన్ని అందించాలని కోరారు. త్వరలో నూతన అధ్యక్షుడు రత్నాకర్ కడుదులతో పాటు కోర్ కమిటీ సభ్యులు పవిత్ర కంది, అశోక్ గౌడ్ దూసరి మరియు నవీన్ రెడ్డి తో కలిసి పూర్తి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని అనిల్ కూర్మాచలం తెలిపారు.   

Follow Us:
Download App:
  • android
  • ios