Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో కన్నడ కుటుంబం అనుమానాస్పద మృతి... ఇంట్లోనే దంపతులు, ఆరేళ్ళ కొడుకు మృతదేహాలు

ఆరేళ్ల కొడుకుతో సహా సాప్ట్ వేర్ దంపతులు అనుమానాస్పద రీతిలో ఇంట్లోనే మృతదేహాలుగా తేలిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. 

Karnataka Family died in America AKP
Author
First Published Aug 20, 2023, 8:47 AM IST

మేరీల్యాండ్ : ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో లేక మరేదైనా ఘోరం జరిగిందో తెలీదుగానీ దేశంకాని దేశంలో ఓ భారతీయ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. ఉపాధి నిమిత్తం కర్ణాటకకు చెందిన దంపతులు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే హఠాత్తుగా ఏమయ్యిందో గానీ ఆరేళ్ళ కొడుకుతో సహా దంపతులు మృతిచెందిననట్లు కర్ణాటకలోని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వారు ఆత్మహత్య చేసుకున్నారని అమెరికా పోలీసులు సమాచారం ఇచ్చినా కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా జగళూరు సమీపంలోని హలేకల్లు గ్రామానికి చెందిన యోగేష్(37) దంపతులకు మంచి ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లారు. యోగేశ్ తో పాటు భార్య ప్రతిభ కూడా సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. వీరికి ఆరేళ్ల యశ్ సంతానం. మేరీ ల్యాండ్ లోని బాల్టిమోర్ లో ఈ కుటుంబం నివాసం వుండేది. ఇలా యోగేశ్ దంపతులు సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ గత తొమ్మిదేళ్లుగా అమెరికాలోనే వుంటున్నారు. 

అయితే ఏమయ్యిందో తెలీదు శనివారం యోగేశ్ కుటుంబం మరణవార్త ఇండియాలోని కుటుంబసభ్యులకు అందింది. బాలిమోర్ట్ పోలీసులు వీరిది ఆత్మహత్య అని చెబుతున్నారని... కానీ భార్యాబిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన సమస్యలేవీ తన కొడుకుకు లేవని తల్లి శోభ అంటోంది. గత గురువారమే తనకు కొడుకు ఫోన్ చేసాడని...  ఎంతో బాగా మాట్లాడాడని అన్నారు. ఇంతలోనే కొడుకు కుటుంబం మరణవార్త రావడంపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Read More  దోమల నివారణ యంత్రంతో చెలారేగిన మంటలు.. ముగ్గురు మనుమరాలతో సహా నాన్నమ్మ మృతి..

కొడుకు, కోడలు, మనవడిని తలచుకుని శోభ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. త్వరగా వారి మృతదేహాలను తరలించేందుకు సాయం చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)

Follow Us:
Download App:
  • android
  • ios