Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంకలో కరోనా బారిన పడ్డ భారతీయులు

నార్త్ కొలంబో ప్రాంతంలో నివాసముండే ఈ కార్మికులకు చేపల మార్కెట్ క్లస్టర్ ద్వారా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రువాన్ విజేముని తెలిపారు

66 Indian nationals tested Covid-19 positive in Sri Lanka
Author
Hyderabad, First Published Nov 14, 2020, 4:14 PM IST

పొట్టకూటికోసం పరాయి దేశం వలసవెల్లిన కొందరు భారతీయులు అక్కడ కరోనా బారినపడ్డారు. శ్రీలంకలో భవన నిర్మాణరంగంలో పనిచేసే 66 మంది భారతీయ కార్మికులు కరోనా బారిన పడ్డారు. దేశ రాజధాని కొలంబోలో శుక్రవారం కార్మికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 

నార్త్ కొలంబో ప్రాంతంలో నివాసముండే ఈ కార్మికులకు చేపల మార్కెట్ క్లస్టర్ ద్వారా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రువాన్ విజేముని తెలిపారు. ప్రస్తుతం ఈ 66 మంది ధర్గా టౌన్‌లోని తాత్కాలిక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.

 కాగా, శ్రీలంకలో ఈ చేపల మార్కెట్ క్లస్టర్ ఇప్పుడు కరోనా కేంద్రంగా మారిందని.. దేశంలో అత్యధిక కేసులు ఈ క్లస్టర్‌తోనే సంబంధం కలిగి ఉంటున్నాయని రువాన్ పేర్కొన్నారు. ఇక శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15,722కు చేరితే.. వీటిలో ఒక్క ఈ క్లస్టర్ పరిధిలోనివే 9,120 కేసులు ఉండడం గమనార్హం.  

Follow Us:
Download App:
  • android
  • ios