Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: 12-14 ఏజ్ గ్రూప్ వ్యాక్సినేష‌న్ షురూ.. తెలంగాణ‌లో మంత్రి హ‌రీశ్ చేతుల మీదుగా ప్రారంభం..

Coronavirus: దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల మధ్య వ‌య‌స్సు ఉన్న వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. తెలంగాణ‌లో మంత్రి హ‌రీశ్ రావు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఎవాన్స్ త‌యారు చేసిన కోర్బెవాక్స్ ను వీరికి అందిస్తున్నారు. 

Telangana : India Starts Vaccinating 12-14 Age Group, Boosters For All Above 60
Author
Hyderabad, First Published Mar 16, 2022, 2:37 PM IST

Coronavirus: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీ మరింతగా విస్తరించింది. ప్రభుత్వం బుధవారం నాడు COVID-19 వ్యాక్సినేషన్ కవరేజీని విస్తరిస్తూ.. 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించింది. అలాగే, 60 సంవత్సరాల వయస్సు పై బడిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వడం కూడా నేడు ప్రారంభమైంది. 12-14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి ఇవ్వాల్సిన COVID-19 వ్యాక్సిన్ కోర్బెవాక్స్ ను హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఎవాన్స్ సంస్థ తయారు చేసింది. 

అర్హులైన వారందరూ టీకాలు వేయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ట్వీట్ చేశారు.

12 నుంచి 14 ఏళ్లలోపు లబ్దిదారులకు మాత్రమే కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను అందిస్తామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ గతంలో ప్రకటించారు. కరోనా వైరస్ వ్యతిరేక పోరులో భాగంగా ప్రభుత్వం అందుబాటలోకి తీసుకువచ్చిన మూడో వ్యాక్సిన్ ఇది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల్లో దీనిని ఉచితంగా అందిస్తారు. 

మంగ‌ళ‌వారం నాడు 12-14 సంవత్సరాల మధ్య పిల్లలకు COVID-19 టీకాలు వేయడానికి కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. బయోలాజికల్ ఇ త‌యారు చేసిన‌ ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ కోర్బెవాక్స్ ను ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ కోర్బెవాక్స్ ను రెండు డోసులుగా అందిస్తామ‌నీ, రెండు డోసులు 28 రోజుల వ్యవధిలో అందిస్తామ‌ని ప్ర‌భుత్వం త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. 14-15 ఏళ్ల మధ్య ఉన్న లబ్దిదారులు ఇప్పటికే 15-18 ఏళ్ల మధ్య వయస్కుల టీకా సమయంలో కవర్ చేసినట్లు కేంద్రం తెలిపింది. మార్చి 1, 2021 నాటికి దేశంలో 12-13 సంవత్సరాల వయస్సు గల 4.7 కోట్ల మంది పిల్లలు ఉన్నారు.

60 ఏళ్లు పైబడిన వారికి, రెండవ డోస్ ఇచ్చిన తేదీ నుండి తొమ్మిది నెలలు - 39 వారాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ముందు జాగ్రత్తగా బూస్ట‌ర్ డోసులు అందించవచ్చని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ప్రాథమిక టీకా వేసిన అదే టీకాతో ముందు జాగ్రత్త మోతాదు టీకాలు వేయాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.

తెలంగాణ‌లో టీకా డ్రైవ్ ప్రారంభించిన మంత్రి హ‌రీశ్ రావు.. 

తెలంగాణలో 12-14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు కోవిడ్-19 టీకా నిర్వహణ డ్రైవ్ బుధవారం ప్రారంభమైంది. ఖైరతాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పి హరీశ్‌ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హత ఉన్న 17 లక్షల మంది పిల్లలకు కార్బెవాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ మోతాదును ఇవ్వ‌నున్నారు. హరీశ్‌ రావు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచిత కోవిడ్ వ్యాక్సిన్‌లను పొందే సువర్ణావకాశాన్ని తల్లిదండ్రులు విస్మరించవద్దని కోరారు. “కోవిడ్ థర్డ్ వేవ్ అంత తీవ్రంగా లేనందున, దయచేసి నిర్ల‌క్ష్యం వ‌ద్ద‌ని అన్నారు. రాబోయే నెలల్లో కరోనావైరస్ ఏ ఆకారం లేదా రూపాన్ని తీసుకుంటుందో మాకు తెలియదు. సురక్షితమైన వైపు ఉండటం ఎల్లప్పుడూ మంచిది. అందుకే తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకుని వీలైనంత త్వరగా పిల్లలకు టీకాలు వేయించాలని కోరుతున్నాను' అని ఆయన చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios