Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మృతి: ధ్రువీకరించిన అధికారులు

తమిళనాడులో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మరణం రికార్డయింది. ఈ విషయాన్ని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ ధ్రువీకరించారు. ఏపీలో కూడా ఓ కేసు నమోదైంది.

Tamil Nadu reports dirst Delta Plus variant death
Author
Chennai, First Published Jun 26, 2021, 2:29 PM IST

చెన్నై: తమిళనాడులో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మృతి నమోదైంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో డెల్టా పల్స్ కోవిడ్ -19 వేరియంట్ మరణాలు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక్కరు డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించారు. 

తమిళనాడులోని మధురైకి చెందిన వ్యక్తి ఈ కొత్త డెల్టా వేరియంట్ సోకి మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మదురై రోగి మరణం తర్వాత నుమానాలను సేకరించి పరీక్షించినట్లు, డెల్టా వేరియంట్ కారణంగా రోగి మరణించాడని తేలినట్లు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యన్ తెలిపారు. 

రాష్ట్రంలో మూడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదైనట్లు, అందులో ఒకరు మరణించినట్లు ఆయన తెలిపారు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినవారిోల ఒకరు చెన్నైకి చెందిన 32 ఏళ్ల నర్సు కాగా, మరో వ్యక్తి కాంచీపురం జిల్లాకు చెందినవారని చెప్పారు. 

దేశంలో 45 వేల నమూనాలను పరీక్షించగా, అందులో 51 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఉన్నట్లు తేలిందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఈ మొత్తం కేసుల్లో 9 తమిళనాడులో, 22 మహారాష్ట్రలో, 9 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, మూడు కేరళలో నమోదైనట్లు తేలింది. పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కటేసి మరణాలు సంభవించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios