Asianet News TeluguAsianet News Telugu

Konijeti Rosaiah Death: రోశయ్య మృతిపై సోనియా, రాహుల్ సంతాపం.. ఫోన్‌లో ఆయన కుమారుడికి పరామర్శ..

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ కూడా రోశయ్య మృతిపై సంతాపం తెలిపారు.

Sonia gandhi and rahul Gandhi expressed their condolences over the death of Rosaiah
Author
Hyderabad, First Published Dec 4, 2021, 1:11 PM IST

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti rosaiah) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రోశయ్య మృతిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావును రాహుల్, సోనియాలు ఫోన్‌లో పరామర్శించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

రోశయ్య మృతిపై రేవంత్ రెడ్డి సంతాపం..
రోశయ్య మృతికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య అకాల మరణం షాక్‌కి గురి చేసిందన్నారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని అన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరన్నారు రేవంత్ రెడ్డి. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు

Also read: Konijeti Rosaiah Death: రోశయ్య మృతికి మోదీ సంతాపం.. ఆ సంభాషణలు గుర్తుచేసుకున్నానని ట్వీట్..


మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ సర్కార్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti Rosaiah Death) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సంతాపం తెలిపింది. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. డిసెంబర్ 4,5,6 తేదీలను సంతాప దినాలు పాటించాలని ఆదేశించింది. రోశయ్య అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయింది. ఇక, రేపు రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి  2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios