Asianet News TeluguAsianet News Telugu

షిమోగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

రాజకీయాల పరంగానూ శివమొగ్గకు మంచి గుర్తింపే వుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కుటుంబానికి షిమోగా పెట్టని కోట అని విశ్లేషకులు చెబుతుంటారు. కేజీ వడయార్, టీవీ చంద్రశేఖరప్ప, ఎస్ బంగారప్ప , యడియూరప్ప వంటి హేమాహేమీలు షిమోగా నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. వీరశైవ లింగాయత్ సామాజికవర్గం ఈ సెగ్మెంట్‌లో బలంగా వుంది. 1952లో ఏర్పడిన షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 10 సార్లు, బీజేపీ 6 సార్లు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కర్ణాటక వికాస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ఒక్కోసారి విజయం సాధించాయి. యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర , కన్నడ అగ్రకథానాయకుడు శివరాజ్ కుమార్ సతీమణి, సీనియర్ రాజకీయవేత్త , మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పలు షిమోగా నుంచే పోటీ చేస్తున్నారు.

Shimoga Lok Sabha elections result 2024 ksp
Author
First Published Apr 1, 2024, 7:59 PM IST

కర్ణాటకలోని కీలక లోక్‌సభ స్థానం షిమోగా.. ఈ పేరు చెప్పగానే పచ్చని ప్రకృతితో పాటు జోగ్ వాటర్ ఫాల్స్, పశ్చిమ కనుమల అందాలు గుర్తొస్తాయి. రాజకీయాల పరంగానూ శివమొగ్గకు మంచి గుర్తింపే వుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కుటుంబానికి షిమోగా పెట్టని కోట అని విశ్లేషకులు చెబుతుంటారు. 90వ దశకం వరకు ఈ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.

కేజీ వడయార్, టీవీ చంద్రశేఖరప్ప, ఎస్ బంగారప్ప , యడియూరప్ప వంటి హేమాహేమీలు షిమోగా నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. వీరశైవ లింగాయత్ సామాజికవర్గం ఈ సెగ్మెంట్‌లో బలంగా వుంది. వారు ఎటువైపు వుంటే ఆ పార్టీయే విజేత. దక్షిణ భారతదేశంలో సమాజ్‌వాదీ పార్టీ పాగా వేసిన స్థానంగా షిమోగాకు గుర్తింపు వుంది. మాజీ సీఎం ఎస్ బంగారప్ప 2005 ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. 

షిమోగా ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. యడియూరప్ప అడ్డా : 

1952లో ఏర్పడిన షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 10 సార్లు, బీజేపీ 6 సార్లు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కర్ణాటక వికాస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ఒక్కోసారి విజయం సాధించాయి. షిమోగా లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో షిమోగా రూరల్, భద్రావతి, షిమోగా, తీర్థహళ్లి, షికారిపురా, సోరబ్, సాగర్, బైండూర్ నియోజకవర్గాలున్నాయి. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో షిమోగా పార్లమెంట్ పరిధిలోని 8 శాసనసభా స్థానాల్లో బీజేపీ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల, జేడీఎస్ 1 చోట విజయం సాధించాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి బీవై రాఘవేంద్రకు 7,29,872 ఓట్లు.. జేడీఎస్ అభ్యర్ధి మధు బంగారప్పకు 5,06,512 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రాఘవేంద్ర మూడోసారి షిమోగా నుంచి ఎంపీగా గెలుపొందారు. 

షిమోగా ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఈసారి బరిలో హేమాహేమీలు :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. ఈసారి ఈ నియోజకవర్గంపై అందరిచూపు నెలకొంది . యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర , కన్నడ అగ్రకథానాయకుడు శివరాజ్ కుమార్ సతీమణి, సీనియర్ రాజకీయవేత్త , మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పలు షిమోగా నుంచే పోటీ చేస్తుండటమే అందుకు కారణం. నాలుగోసారి విజయం సాధించాలని పట్టుదలగా వున్నారు. తన కుటుంబానికి, బీజేపీకి కంచుకోట వంటి షిమోగాలో తన విజయం నల్లేరుపై నడకేనని రాఘవేంద్ర భావిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. రాజ్‌కుమార్ కుటుంబానికి వున్న బ్రాండ్ నేమ్, లక్షలాది మంది అభిమానులు, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో వుండటంతో ఆమె గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి. ఈశ్వరప్ప విషయానికి వస్తే.. రాజకీయంగా అపార అనుభవం, వ్యూహాలు పన్నడంలో దిట్టగా ఆయనకు పేరుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios