Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న ఆకస్మిక గుండె మరణాలకు దీర్ఘకాలిక కోవిడ్ -19తో సంబంధం ఉండొచ్చు - నిపుణులు

ఇటీవల యువకులు, పెద్ద వారు అనే తేడా లేకుండా గుండెపోటుతో చనిపోతున్నారు. ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. అయితే వీటికి ధీర్షకాలిక కోవిడ్ -19 సంబంధాలు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Rising sudden cardiac deaths may be linked to chronic Covid-19 - experts
Author
First Published Mar 14, 2023, 11:21 AM IST

అంతర్జాతీయ అధ్యయనాలు సూచించినట్లుగా ఆకస్మిక గుండె మరణాలు పెరగడానికి దీర్ఘకాలిక కోవిడ్ -19 ప్రభావాలతో ముడిపడి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని ధృవీకరించడానికి మరింత పరిశోధన, రెగ్యులర్ మానిటరింగ్ అవసరం అని చెబుతున్నారు. ఇటీవలి నెలల్లో తెలంగాణలో చాలా మంది రోగులు అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మరణించారు.

హోటల్ గదిలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య... పోలీసు డ్రెస్సులో వచ్చి రూం తీసుకుని..

‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలి గుండెపోటుతో ఇటీవల మృతి చెందాడు. అయితే గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కేవలం తెలంగాణలో ఇలాంటి మరణాలు సంభవించడం లేదని ఆ మీడియా సంస్థ నివేదించింది.  అమెరికాలో కూడా లాంగ్ కోవిడ్ ప్రభావం చూపుతోందని డాక్టర్ కాకర్ల సుబ్బారావు సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్ డాక్టర్ సుబోధ్ కందముత్తన్ తెలిపారు.

మద్యం మత్తులో పెళ్లి కొడుకు... పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..!

‘‘కోవిడ్ -19 బారిన పడిన వ్యక్తులు, యువకులు కూడా గుండె పొరలో మంట అనుభవిస్తారు. అలాంటి సందర్భాల్లో అకస్మాత్తుగా విపరీతమైన వ్యాయామం లేదా జీవనశైలిలో మార్పు గుండెను మరింత ప్రభావితం చేస్తుంది. తెలంగాణతో పాటు భారత్ లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి’’ అని డాక్టర్ సుబోధ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా అనేక దేశాలు అనేక అధ్యయనాలు నిర్వహించాయని, కోవిడ్ -19 సోకిన రోగులు వివిధ హృదయ సంబంధ అంశాలతో ప్రభావితమవుతున్నారని వాటిలో తేలిందని ఆయన అన్నారు.

మన దేశంలో కేవలం కార్డియాక్ అరెస్ట్ మరణాలు సంభవిస్తుండగా.. పాశ్చాత్య దేశాలు కూడా దీర్ఘకాల కోవిడ్ ఇతర ప్రభావాలైన శ్వాస ఆడకపోవడం, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే భారతదేశంలో వీటికి సరైన డాక్యుమెంటేషన్ లేదు. కరోనా మహమ్మారికి ముందు కూడా ఇలాంటి మరణాలు సంభవించినప్పటికీ వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే ఈ విషయం తెలిసేది.

కాంగ్రెస్-బీజేపీలు అన్నదమ్ముల లాంటివారు.. ఏళ్ల‌త‌ర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను దోచుకున్నారు.. : కేజ్రీవాల్

‘‘కరోనా కంటే ముందు కూడా చాలా మంది యువ రోగులకు చికిత్స చేశాను. అయితే, ఇప్పుడు చాలా కేసులు విస్తృతంగా కనిపిస్తున్నాయి’’ అని హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవి కాంత్ అతులూరి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ’తో తెలిపారు. గుండె సమస్యలున్న యువకుల సంఖ్య మునుపటి మాదిరిగానే ఉందని చెప్పారు. కానీ భయాందోళనల కారణంగా అనవసరంగా అనేక మంది హాస్పిటల్ లో అడ్మిట్ అవుతున్నారని తెలిపారు. కాగా.. వీటికి యువత ప్రభావితమవుతున్న విషయాన్ని ఆయన ఖండించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios