Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: 34 ల‌క్ష‌ల మంది టీనేజ‌ర్ల‌కు రెండు డోసుల కోవిడ్ టీకాలు !

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా అధికారులు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 34 ల‌క్ష‌ల మంది టీనేజ‌ర్ల‌కు క‌రోనా టీకా రెండు డోసులు అందించిన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 
 

Over 34 lakh eligible adolescents given second dose of COVID-19 vaccine: Government
Author
Hyderabad, First Published Feb 4, 2022, 12:37 PM IST

Coronavirus: అన్ని దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. కోవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ అంచ‌నాలు తీవ్ర భయాందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌రోనా (Coronavirus)మ‌హ‌మ్మారి సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. క‌రోనా  కొత్త కేసులు నిత్యం ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి. అయితే, గ‌త ఈ వారం ప్రారంభం నుంచి కొత్త కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. మ‌ర‌ణాలు మాత్రం క్ర‌మంగా పెరుగుతున్నాయి. 

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తోంది. దీనిలో భాగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. పెద్ద‌ల‌తో పాటు టీనేజ‌ర్ల‌కు కూడా టీకాలు అందిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి టీనేజ‌ర్ల‌కు (15 నుంచి 18 సంవ‌త్స‌రాలు ఉన్న వారికి) కోవిడ్-19 టీకాలు అందిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయస్కుల్లో 65 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్‌ను మొదటి డోస్ పొందారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం తెలిపారు. "యువ భార‌త‌ం చారిత్రాత్మక ప్రయత్నం కొనసాగుతోంది. కేవలం 1 నెలలోనే  15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 65% మంది కోవిడ్‌-19 టీకా మొదటి డోస్ పొందారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్య‌క్ర‌మం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది" అని ఆయన ట్వీట్ చేశారు.

 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం.. 34.90 లక్షల మంది కౌమారదశలో ఉన్నవారికి కోవిడ్ టీకా రెండు డోసుల టీకాలు అందించారు. గత 24 గంటల్లో 55 లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదులను పంపిణీ చేశారు. శుక్ర‌వారం ఉద‌యం 7 గంటల వరకు ఉన్న వ్యాక్సినేష‌న్ డేటా ప్ర‌కారం.. భారతదేశంలో మొత్తం 168.47 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 89.8 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 72.1 కోట్ల మంది ఉన్నారు.  ప్ర‌స్తుతం బూస్ట‌ర్ డోసులు కూడా అందిస్తున్నారు. కాగా, గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించబడింది. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు టీకాలు అందించారు. గత ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్‌లైన్ కార్మికుల (ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ) టీకాలు వేయడం ప్రారంభమైంది.

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా గత ఏడాది మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏండ్లు అంత‌కంటే ఎక్కువ వయస్సు ఉండి.. ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి టీకాలు అందిస్తున్నారు. ఇక  ఏడాది ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ గత ఏడాది మే 1 నుంచి టీకాలు వేయడానికి అనుమతిస్తూ.. కోవిడ్‌-19 టీకా కార్యక్రమాన్ని విస్తరించింది ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది జ‌న‌వ‌రి 3 నుంచి 15-18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశ (టీనేజ‌ర్ల‌కు) పిల్ల‌ల‌కు టీకాలు అందించ‌డం ప్రారంభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios