Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: యూఎస్‌లో ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ పంజా.. డ‌బ్ల్యూహెచ్‌వో, ప్ర‌పంచ దేశాల ఆందోళ‌న‌.. !

Coronavirus: అత్యంత ప్ర‌మాద‌ర‌క‌రమైన ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ కార‌ణంగా మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో పాటు చాలా దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. 
 

Omicron Variant BA.2 Spreading: What We Know So Far In 5 Points
Author
Hyderabad, First Published Mar 22, 2022, 2:51 PM IST

Coronavirus: క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. చైనా, ద‌క్షిణ కొరియా, అమెరికా స‌హా ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో క‌రోనా ఉధృతి అధికం అవుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం అతి వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వేరియంట్ కు చెందిన బీఏ.2 స‌బ్ వేరియంట్ అని నిపుణులు, ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు. BA.2 సబ్‌వేరియంట్ కారణంగా పశ్చిమ ఐరోపాలో COVID-19 ప్ర‌భావం మళ్లీ పెరుగుతోందని నిపుణులు తెలిపారు. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ బీఏ.2కు సంబంధించిన టాప్ అంశాలు ఇలా ఉన్నాయి... 

1. శాన్ డియాగోకు చెందిన జెనోమిక్స్ సంస్థ హెలిక్స్.. జనవరి ప్రారంభంలో అమెరికాలో మొదటిసారి ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ బీఏ.2 క‌నిపించింది. అయితే, ప్రారంభంలో దీని ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉండి.. నెమ్మ‌దిగా వ్యాపించింది. అయితే, ప్ర‌స్తుతం అమెరికాలో న‌మోద‌వుతున్న కోవిడ్‌-19 కేసుల‌లో 50 శాతం నుండి 70 శాతం ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ బీఏ.2కు సంబంధించిన‌వేన‌ని అంచ‌నాలు ఉన్నాయ‌ని అంచ‌నా వేసింది. 

2. అమెరికా వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ ప్ర‌స్తుతం క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఓమిక్రాన్ కంటే BA.2 60 శాతం ఎక్కువగా వ్యాపిస్తోంద‌ని తెలిపారు. అయితే ఇది మరింత తీవ్రంగా ఉన్నట్లు కనిపించడం లేద‌ని తెలిపారు. అయితే, ఇది పెరిగిన క‌రోనా ప్ర‌భావ ప్ర‌సార సామ‌ర్థ్యాన్ని క‌లిగివుంద‌ని డాక్టర్ ఫౌసీ మీడియాతో అన్నారు. 

3. క‌రోనా వైరస్ నుండి తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించడానికి సకాలంలో టీకాలు వేయడం మరియు బూస్టర్ షాట్‌లు ఉత్త‌మంగా ప‌నిచేస్తాయ‌ని ఫౌసీ తెలిపారు. అలాగే,  చైనా మరియు యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేరియంట్ ఇప్పటికే COVID-19 కేసుల పెరుగుదలకు కారణమైంద‌న్నారు. 

4. కొంతమంది నిపుణులు BA.2 దాని ముందున్న BA.1 కంటే 30 శాతం మాత్రమే అధిక ప్ర‌భావం చూప‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. డాక్టర్ ఫౌసీ అంచనా ప్రకారం 60 శాతం ప్ర‌భావం అధికంగా ఉంటుంద‌ని తెలిపారు. ఈ సబ్‌వేరియంట్‌ను కొన్నిసార్లు "స్టీల్త్ ఓమిక్రాన్" అని పిలుస్తారు..  ఎందుకంటే దీనిని గుర్తించడం చాలా కష్టం.

5. ప్ర‌పంచ‌ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. BA.2 దాని జన్యు క్రమంలో BA.1 నుండి భిన్నంగా ఉంటుంది, ఇందులో స్పైక్ ప్రోటీన్ మరియు ఇతర ప్రోటీన్‌లలో కొన్ని అమైనో ఆమ్ల వ్యత్యాసాలు ఉన్నాయి. BA.1 కంటే BA.2 వృద్ధి ప్రయోజనాన్ని కలిగి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వృద్ధి ప్రయోజనానికి గల కారణాలను అర్థం చేసుకోవడానికి అధ్యయనాలు కొనసాగుతున్నాయి, అయితే ప్రాథమిక డేటా BA.1 కంటే BA.2 అంతర్లీనంగా ఎక్కువగా ప్రసారం చేయబడుతుందని సూచిస్తుంది.

6. ప్రపంచంలో  ఇప్పటివరకు మొత్తం 472,719,966 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,106,267 మంది కోవిడ్  కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఒక్క అమెరికాలోనే 81,448,402 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 998,840 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, యూకేలు టాప్5 లో  ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios