Asianet News TeluguAsianet News Telugu

శ్రద్ధావాకర్‌ హత్య తరహాలో.. ఓ వ్యక్తిని అంతమొందించి.. 400 ముక్కలు చేసిన తండ్రీకొడుకులు 

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడిని చంపిన తండ్రి కుమారులు అత్యంత దారుణంగా  అతడి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు. అనంతరం వాటిని వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. ఢిల్లీలో  శ్రద్ధావాకర్‌ హత్య తరహాలో రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Madhya Pradesh Father son duo kills man, chops off body into 400 pieces KRJ
Author
First Published Nov 30, 2023, 9:57 AM IST

తండ్రీ కొడుకులు కలిసి దారుణానికి పాల్పడ్డారు. ఓ యువకుడిని హత్య చేసి, అత్యంత దారుణంగా అతని శరీర భాగాలను 400 ముక్కలుగా నరికారు. అనంతరం ఆ శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం జరిగి దాదాపు రెండు నెలలు గడిసినఈ హత్యకేసులో నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పూర్‌కు చెందిన రాజు ఖాన్ అనే యువకుడికి కల్లుఖాన్, నజీమ్ అనే తండ్రికొడుకులతో వివాదం ఏర్పడింది. దీంతో రాజు ఖాన్ పోలీసులను ఆశ్రయించారు. ఆ తరువాత ఆ సమస్యను పెద్దల మధ్య చర్చించి పరిష్కరించుకున్నారు. అయితే. తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలంటే.. రూ. 20 వేల రూపాయాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు రాజుఖాన్.

డబ్బులు ఇస్తానని నమ్మించిన ఆ తండ్రీకొడుకులు ఓ మధ్యవర్తి ఇంటికి రప్పించారు. అక్కడికి చేరుకున్న తర్వాత  ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం క్రమంగా గొడవకు దారి తీసింది. ఈ తరుణంలో తండ్రీకొడుకులు రాజుఖాన్‌పై దాడి చేసి.. హతమార్చారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా మృతుడు రాజ్ ఖాన్ శరీరాన్ని 400 ముక్కలుగా కోసి చిన్న చిన్న బ్యాగుల్లో ప్యాక్ చేసి.. వేరేవేరు ప్రాంతాల్లో పడేశాడు.  

ఈ క్రమంలో గత నెల 28న గ్వాలియర్‌లోని జనక్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి శరీరభాగాలు లభ్యమయ్యాయి. దీంతో రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ  మృతదేహం భాగాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించగా.. అవి బహదూర్‌పూర్‌కు చెందిన రాజుఖాన్‌ శరీర భాగాలని తేలాయి. ఈ క్రమంలో రాజుఖాన్ కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. హత్యలో స్మగ్లర్ కల్లు ఖాన్ కుమారుడు నజీమ్ ఖాన్ హస్తం ఉందని ఆరోపించారు. అయితే.. తాము హత్య చేసిన వ్యక్తి శరీర భాగాలు పోలీసులకు దొరికాయని తెలియడంతో నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసుల అనుమానం మరింత ఎక్కువైంది. ః దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన తండ్రీకొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మరోవైపు డ్రగ్స్‌కు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం కల్లు ఖాన్‌ కోర్టుకు హాజరుకాగా.. జైలు శిక్ష పడింది. మరోవైపు, అతని కొడుకు పోలీసుల నుండి తప్పించుకుంటున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో పోలీసులు తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య చేసింది తానేనని అంగీకరించాడు.

మరోవైపు డ్రగ్స్​కు సంబంధించిన కేసు విచారణ కోసం కల్లూఖాన్​ కోర్టులో హాజరుకాగా.. అతనికి జైలుశిక్ష విధించింది. మరోవైపు అతని కుమారుడు పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఎట్టకేలకు పోలీసులు అతడిని ఆగ్రాలో అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో తండ్రిని, కొడుకును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. దీంతో హత్య చేసినట్లుగా అంగీకరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios