Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: లాంగ్ కోవిడ్‌.. శ‌రీరంపై సుదీర్ఘకాలం పాటు ప్ర‌భావం.. డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చరిక‌లు

Coronavirus: క‌రోనా వైర‌స్ నిత్యం మ్యూటేష‌న్ల‌కు లోన‌వుతూ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌పంచ దేశాల‌ను మ‌రోసారి హెచ్చ‌రించింది. ఒమిక్రాన్ వేరియంట్ త‌ర్వాత లాంగ్ కోవిడ్ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌స్తావిస్తూ.. శ‌రీరంలోని ప్ర‌తి భాగంపై క‌రోనా వైర‌స్ సుదీర్ఘ‌కాలం పాటు ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొంది. లాంగ్ కోవిడ్ గురించిన విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. హెచ్చరించింది. 
 

Long COVID symptoms after Omicron: WHO on worrying signs to watch out for
Author
Hyderabad, First Published Feb 13, 2022, 2:12 PM IST

Coronavirus: 2019లో చైనాలోని వుహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి త‌క్కువ కాలంలోనే యావ‌త్ ప్ర‌పంచాన్ని చుట్టుముట్టేసింది. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేస్తూ.. ల‌క్ష‌ల మంది ప్రాణాలను బ‌లితీసుకుంది. ఇప్ప‌టికీ చాలా దేశాల్లో త‌న విజృంభణ కొన‌సాగిస్తోంది. క‌రోనా వైర‌స్ నిత్యం మ్యూటేష‌న్ల‌కు లోన‌వుతూ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. ఇప్ప‌టికే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా, ఒమిక్రాన్‌, దాని స‌బ్ వేరియంట్లు మాన‌వాళికి స‌వాలు విసురుతున్నాయి. నేప‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌పంచ దేశాల‌ను మ‌రోసారి హెచ్చ‌రించింది. ఒమిక్రాన్ వేరియంట్ త‌ర్వాత లాంగ్ కోవిడ్ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌స్తావిస్తూ.. శ‌రీరంలోని ప్ర‌తి భాగంపై క‌రోనా వైర‌స్ సుదీర్ఘ‌కాలం పాటు ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొంది. 

క‌రోనా మ‌హ‌మ్మారి సాధార‌ణ అనారోగ్యాల‌తో పాటు శ్వాస‌నాల సంబంధ రోగాలు, శ్వాస‌ తీసుకోవ‌డంలో ఇబ్బందులు క‌లిగించ‌డం నుంచి గుండె జ‌బ్బుల వ‌ర‌కు క‌రోనా వైర‌స్ కార‌ణం అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు అంచనా వేస్తున్నారు. దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారులు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ సోకిన వారిలో సుదీర్ఘ‌కాలం పాటు కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉండ‌టం.. శ‌రీరంపై ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని పేర్కొన్నారు. ఇత‌ర వేరియంట్ల‌తో పోలిస్తే.. దీని స‌బ్ వేరియంట్ల ప్ర‌భావం కూడా అధికంగా ఉంద‌నీ, దీనిపై మ‌రింత‌గా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ఒమిక్రాన్‌, దాని స‌బ్ వేరియంట్ల గురించి ఇంకా పూర్తి స‌మాచారం తెలియ‌దు కాబ‌ట్టి.. దీని వ్యాప్తిని త‌గ్గించ‌డంపై మ‌నం దృష్టి పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొంది. 

లాంగ్ కోవిడ్‌ అంటే ఏమిటి? 

లాంగ్ కోవిడ్ సాధారణంగా కోవిడ్-19తో పోరాడిన చాలా వారాల తర్వాత నిర్ధారణ అవుతుంది. ఏదైనా దీర్ఘకాలిక ప్రభావాలు సాధారణంగా ప్రారంభ ఇన్ఫెక్షన్ లక్షణాలు పోయిన 90 రోజుల తర్వాత కనిపిస్తాయ‌ని WHO వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రభావాలు కొన్ని వారాలు  లేదా కొన్ని నెలలు.. సంవ‌త్సరాల త‌ర్వాత కూడా ఉండ‌వ‌చ్చు. అయితే, దీని గురించి ఇంకా పూర్తిగా తెలియ‌దు. 

ఓమిక్రాన్ తర్వాత రోగులు ఎక్కువ కాలం కోవిడ్‌తో బాధపడగలరా?

Omicron నిజంగా తక్కువ సమయం వరకు మాత్రమే  క‌నిపిస్తోంది. అయితే, దీనిపై పూర్తిగా ఒక నిర్ణ‌యానికి ఇప్పుడే రాలేము. లాంగ్  కోవిడ్‌తో బాధపడే వ్యక్తుల శాతంలో తేడాను చూడగలమని సూచించడానికి నిజంగా ఎటువంటి సూచన లేదు, కానీ దీర్ఘకాల COVID గురించి మాకు ఇంకా పూర్తి స‌మాచారం కావాల్సి ఉంది అని వాన్ కెర్ఖోవ్ చెప్పారు.

లాంగ్ కోవిడ్ లక్షణాలు ఏమిటి? 

వైరస్ దీర్ఘకాలిక ప్రభావాల తీవ్రతను గమనిస్తూ..ఇది శరీరంలోని అన్ని అవయవాలను ఒకే సమయంలో ప్రభావితం చేయదు. కానీ, సాధార‌ణ అనారోగ్య సమ‌స్య‌ల నుంచి శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డ‌టం, గుండె జ‌బ్బులు రావ‌డం వంటి ల‌క్ష‌ణాలుంటాయి. కోవిడ్ అంటే ఎగువ శ్వాసకోశ వ్యాధిగా భావిస్తారు.. కానీ ఇది దైహిక వ్యాధి (systemic disease) అని పేర్కొన్నారు. ఇది ఒక సంవత్సరం తర్వాత హృదయనాళ వ్యవస్థలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుందని WHO అధికారి డాక్టర్ అబ్ది మహముద్ తెలిపారు. "COVID నుండి వచ్చే ప్రమాదం మరియు సంక్లిష్టత, మనం చూసినప్పుడు అది శ్వాసకోశ వ్యాధికారకమైనది కాదు. అయితే, అది ప్రవేశ మార్గం, కానీ ఇది నాళాల కారణంగా మీ శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది వాస్కులైటిస్‌కు కారణమవుతుంది" అని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios