Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: దేశంలో తగ్గని కరోనా మరణాల ఉధృతి.. ల‌క్ష దిగువ‌కు కేసులు !

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప‌లు రాష్ట్రాల్లో కొన‌సాగుతూనే ఉంది. అయితే, దేశంమొత్తం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే కోవిడ్ కొత్త‌ కేసుల్లో భారీగా త‌గ్గుద‌ల న‌మోదైంది. ఒక నెల రోజుల త‌ర్వ‌త భార‌త్ లో కోవిడ్ రోజువారీ క‌రోనా కేసులు ల‌క్ష దిగువ‌కు ప‌డిపోయాయి. మరణాలు మాత్రం నిత్యం వేయికి పైగానే నమోదవుతున్నాయి.  
 

Indias Daily Covid Cases Drop Below 1 Lakh After A Month
Author
Hyderabad, First Published Feb 8, 2022, 9:57 AM IST

Coronavirus: ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. గ‌త నెల రోజుల నుంచి భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. క‌రోనా (Coronavirus)మ‌హ‌మ్మారి సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. భార‌త్ లో క‌రోనాతో చనిపోయిన వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 5 ల‌క్ష‌ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐదు ల‌క్ష‌ల మంది పైగా మ‌ర‌ణాలు సంభ‌వించిన మూడో దేశంగా భార‌త్ నిలిచింది. అయితే, ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నెల రోజుల త‌ర్వాత దేశంలో రోజువారీ కేసులు ల‌క్ష దిగువ‌కు ప‌డిపోయాయి. అయితే, మ‌ర‌ణాలు మాత్రం నిత్యం వేయికి పైగానే న‌మోదు అవుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్నది. 

ఇదిలావుండ‌గా, దేశంలో నిత్యం ల‌క్ష‌కు పైగా క‌రోనా కేసులు (Coronavirus) న‌మోద‌వుతున్నాయి. అయితే, ఈ వారం ప్రారంభం నుంచి కోవిడ్‌-19 కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో కొత్తగా రోజువారీ కేసులు లక్ష దిగువ‌ర‌కు ప‌డిపోయాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 67,597 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,23,39,611 కు చేరింది. Coronavirus యాక్టివ్ కేసులు సైతం ప‌దిల‌క్ష‌ల దిగువ‌కు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 9,94,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైరస్ నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా  (Coronavirus)రిక‌వ‌రీల సంఖ్య 4,08,40,658 కి పెరిగింది. 

దేశంలో కోవిడ్ కేసులు  (Coronavirus) త‌గ్గుతున్న‌ప్ప‌టికీ మ‌ర‌ణాలు మాత్రం నిత్యం వేయికి పైగానే న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో  క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 1188 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా కార‌ణంగా భార‌త్ లో చ‌నిపోయిన వారి సంఖ్య 5,04,062ల‌కు చేరుకుంది. కోవిడ్మ‌-19 మ‌ర‌ణాలు రేటు 1.19 శాతంగా ఉంది. రిక‌వ‌రీ రేటు 96.2 శాతంగా ఉంది. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 9.1 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా (Coronavirus) కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. 

క‌రోనా (Coronavirus) నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 170.2 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 90.1 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 72.8 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం74,15,61,587 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. సోమ‌వారం ఒక్క‌రోజే 11,56,363 కోవిడ్‌-19  (Coronavirus) శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios