Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: 40 శాతం పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..?

Covid-19: గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ కొత్త కేసుల న‌మోదులో 40 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. ఈ వారం ప్రారంభం నుంచి కోవిడ్-19 కేసులు క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఆందోళ‌న అధికం అవుతోంది.  
 

India Reports 7,240 New Covid Cases, Nearly 40% Jump For 2nd Straight Day
Author
Hyderabad, First Published Jun 9, 2022, 1:05 PM IST

Coronavirus India Updates: ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో తీవ్ర స్థాయిలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజురోజుకూ త‌న రూపు మార్చుకుంటున్న కోవిడ్‌-19 అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ కొత్త కేసుల న‌మోదులో 40 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. ఈ వారం ప్రారంభం నుంచి కోవిడ్-19 కేసులు క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఆందోళ‌న అధికం అవుతోంది. దేశంలో గురువారం 7,240 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ఒక రోజు క్రితం కంటే దాదాపు 40 శాతం ఎక్కువ. ఎందుకంటే మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కోవిడ్‌-19 కేసులు బాగా పెరిగాయి. మార్చి 2 నుండి రోజువారీ కేసుల సంఖ్యలో ఇది అత్యధిక పెరుగుదల. బుధవారంతో పోలిస్తే.. భారతదేశం రోజువారీ కోవిడ్ కేసులలో దాదాపు 41 శాతం పెరిగింది.

అంత‌కు ముందురోజు దేశంలో 5,233 క‌రోనా ఇన్‌ఫెక్షన్ కేసులు న‌మోద‌య్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో రోజువారీ కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు 94 రోజుల తర్వాత 5,000 దాటాయి (బుధ‌వారం నాడు దేశంలో 5,233 కేసులు న‌మోద‌య్యాయి).  మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 32,498కి చేరుకుంది. గత 24 గంటల్లో రోజువారీ పాజిటివిటీ రేటు 1.31 శాతంగా ఉండగా, వారంవారీ పాజిటివిటీ రేటు 2.13గా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ కొత్త‌గా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్-19 మరణాల సంఖ్య 5,24,723కి చేరుకుంది. క‌రోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంలో 4.31 కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుండ‌గా దేశంలో ప్ర‌స్తుతం న‌మోదైన క‌రోనా కేసుల్లో అత్య‌ధికం మ‌హారాష్ట్ర, కేర‌ళ‌లో న‌మోద‌య్యాయి. బుధవారం మహారాష్ట్రలో 2,701 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. జనవరి 25 నుండి అత్యధికంగా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. కనీసం 42 శాతం ఇన్ఫెక్షన్లు దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి నుండి నివేదించ‌బ‌డ్డాయి. అలాగే, ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా అంచ‌నా వేసిన ఒమిక్రాన్ BA5 వేరియంట్  కేసు కూడా రాష్ట్రంలో న‌మోదైంది. కేరళలో గత 24 గంటల్లో 2,271 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రంలో ఒక్క వారంలో 10,805 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదుకావ‌డం గ‌మ‌నార్హం. 

భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య ఆగస్టు 7, 2020న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు మరియు సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటింది. ఇక సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశం గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని దాటింది.  దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కేసులు, మ‌ర‌ణాలు అధికంగా మ‌హారాష్ట్రలో న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాతి స్థానంలో కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, హ‌ర్యానాలు ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios