Asianet News TeluguAsianet News Telugu

వరుస‌గా నాల్గో రోజు 10 వేల‌కు పైగా కోవిడ్ కొత్త కేసులు.. ఎన్ని మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయంటే..?

New Delhi: దేశంలో వరుసగా నాలుగో రోజు 10 వేలకు పైగా కోవిడ్-19 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు పెరగడం ఇది వరుసగా నాలుగో రో కావడం గమనార్హం. ఇదే క్ర‌మంలో మ‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. 
 

For the fourth day in a row, India recorded over 10,000 new covid-19 cases and 19 coronavirus deaths  RMA
Author
First Published Apr 16, 2023, 11:14 AM IST

covid-19 india update:  భార‌త్ లో క‌రోనా వైర‌స్ కేసులు క‌ల‌క‌లం కొన‌సాగుతూనే ఉంది. నిత్యం 10 వేల‌కు పైగా కోవిడ్ కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  గత 24 గంటల్లో భారతదేశంలో 10,093 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.  ఇది నిన్నటి 10,747 ఇన్ఫెక్షన్ల కంటే 6 శాతం తక్కువ. గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు పెరగడం, 10 వేల‌కు పైగా న‌మోదుకావ‌డం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,542కు చేరుకుంది. అలాగే, మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 19 మరణాలు నమోదయ్యాయి.  దీంతో దేశంలో మొత్తం మ‌ణాలు సంఖ్య 531114కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 

ఇదిలావుండ‌గా, కోవిడ్-19 తో ఇప్ప‌టివ‌ర‌కు 44229459 మంది కోలుకున్నారు. క‌రోనా వైర‌స్ రిక‌వ‌రీ రేటు 98.68 శాతంగా ఉంది. అలాగే, మ‌ర‌ణాలు రేటు 1.19 శాతంగా ఉంది. జాతీయ కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 220,66,26,324 డోసుల‌ను అందించారు.  

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అదుపులో ఉంచ‌డానికి, క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. మరో 10-12 రోజుల పాటు కేసులు పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫెక్షన్ ప్రస్తుతం అంటువ్యాధి దశలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అంటువ్యాధి దశలో, సంక్రమణ ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయబడుతుందని పేర్కొన్నాయి. 

తెలంగాణ‌లో కొత్త‌గా 31 కేసులు.. 

తెలంగాణలో కొత్తగా 31 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 8,42,932 కు చేరుకుంది. కొత్త మరణాలు నమోదు కాకపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,111గా ఉంది. కొత్తగా 31 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 8,38,574 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 0.49 శాతంగా ఉండగా, రికవరీ రేటు 99.4 శాతంగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios