Asianet News TeluguAsianet News Telugu

రైతు సంఘాల నేటి సమావేశంలో రైతు ఉద్యమంపై కీలక నిర్ణయం !

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతు ఉద్య‌మం ప్రారంభ‌మైంది. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన శీత‌కాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ ఆమోదంతో పాటు రాష్ట్రప‌తి సైతం గెజిల్ నోటిఫికేష‌న్‌ను విడుదల చేశారు. రైతులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని విర‌మించుకోలేదు. శ‌నివారం జ‌రిగే రైతు సంఘాల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశ‌ముంది. 
 

Farmers Protest latest updates
Author
Hyderabad, First Published Dec 4, 2021, 2:47 PM IST

రైతు స‌మ‌స్య‌లు, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ప్రారంభించిన ఉద్య‌మం ఇటీవ‌లే ఏడాదిని పూర్తిచేసుకుంది. రైత‌న్న‌ల అలుపెరుగ‌ని పోరాటంతో కేంద్రం వెన‌క్కి త‌గ్గింది. ఆ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దానికి అనుగుణంగానే సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. రెండు స‌భల్లోనూ ఆమోదింప‌జేసింది. ఆ చ‌ట్టాలు ర‌ద్దుకు సంబంధించి రాష్ట్రప‌తి సైతం గెజిట్ నోటిఫికేష‌న్ విడుదల చేశారు. కానీ రైతులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నారు. 

Also Read: చిన్నారులపై ఒమిక్రాన్ పంజా.. సౌత్ ఆఫ్రికా సైంటిస్టుల ఆందోళ‌న

 

ఇటీవ‌లే రైతు ఉద్య‌మం కొన‌సాగుతున్న నిర‌స‌న స్థ‌లి నుంచి రైతులు ఇండ్ల‌కు చేరే విధింగా ప్ర‌భుత్వం త‌మ‌పై ఒత్తిడి చేస్తున్న‌ద‌ని రైతు సంఘాలు పెర్కొన్న సంగ‌తి తెలిసిందే. అలాగే, వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు మాత్ర‌మే కాదు, పంట గిట్టుబాటు ధ‌ర‌, రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత‌, ఉద్య‌మం నేప‌థ్యంలో చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించ‌డం స‌హా ప‌లు డిమాండ్ల‌తో ఉద్య‌మం కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే రైతు సంఘాలు దేశ‌రాజ‌ధాని స‌రిహ‌ద్దులోని నిర‌స‌న స్థ‌లివ‌ద్ద శ‌నివారం స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని గ‌త వారం పేర్కొన్నాయి.  అయితే,  శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు జ‌ర‌గాల్సిన సంయుక్త కిసాన్ మోర్చ నేతృత్వంలోని రైతు సంఘాల స‌మావేశం ఆల‌స్య‌మైంది. మ‌రికొద్ది గంట‌ల్లో ఈ స‌మావేశం ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 

Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్య‌ధిక‌సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రోశ‌య్య‌

 కేంద్ర ప్ర‌భుత్వం మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత రైతు సంఘాల స‌మావేశం జ‌రుగుతుండ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రైత‌న్న‌లు చేస్తున్న ఆందోళ‌న‌లు విర‌మించాలా?  కొన‌సాగించాలా?  రైతుల ఇత‌ర డిమాండ్లు వంటి అంశాలు ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం.  కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా పంట‌కు గిట్టుబాటు ధ‌ర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత, రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయడంతో పాటు, అమరులైన అన్నదాతలకు పరిహారం ఇవ్వాలని ఇప్పటికే రైతులు డిమాండ్‌ చేశారు. అలాగే విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయ‌. ఈ నేప‌థ్యంలో ఇటు ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌జానీకంలోనూ నిర‌స‌న తెలుపుతున్న రైతు సంఘాలు తీసుకునే నిర్ణ‌యంపై ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. 

 Also Read: భార‌త్‌లో ల‌క్ష‌దిగువ‌కు క్రియాశీల కేసులు.. మ‌రోవైపు ఒమిక్రాన్ ఆందోళ‌న‌లు

రైతులు డిమాండ్ల‌లో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయడానికి ఢిల్లీలో స్థలం ఇవ్వాలనేది కూడా ఒక‌టిగా ఉంది. ఈ డిమాండ్ల‌కు అంగీక‌రించ‌డ‌తో పాటు ప్ర‌భుత్వం నుంచి అధికారి హామీలు అందితే నిర‌స‌న‌ల‌ను విర‌మించుకుంటామ‌ని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ప్ర‌భుత్వం నుంచి వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌ట‌న రాకుంటే ఉద్య‌మం మ‌రింత ఉధృతం చేస్తామ‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు.  అయితే, ప్ర‌స్తుత స‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారనే దానిపై  ఉత్కంఠ నెల‌కొంది. 

Also Read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశ‌య్య.. రాజకీయ ప్రస్థానం..

Follow Us:
Download App:
  • android
  • ios