Asianet News TeluguAsianet News Telugu

Corona virus : మ‌ళ్లీ విజృంభిస్తున్న కోవిడ్.. 24 గంట‌ల్లో 21,566 కొత్త కేసులు, 45 మ‌ర‌ణాలు న‌మోదు..

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లోనే దాదాపు 20 వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 45 మంది కోవిడ్ వల్ల చనిపోయారు. 

Covid is booming again.. 21,566 new cases and 45 deaths were registered in 24 hours..
Author
New Delhi, First Published Jul 21, 2022, 11:21 AM IST

కొంత కాలం వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. ఇటీవ‌ల కేసులు ఒక్క సారిగా పెరుగుతూ వ‌స్తున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 21,566 కొత్త కోవిడ్ -19 కేసులు న‌మోదు అయ్యాయి. కోవిడ్ వ‌ల్ల 45 మరణాలు సంభ‌వించాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,25,870కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపారు. ఈ మేర‌కు గురువారం (జూలై 21, 2022) తాజా బులిటెన్ ను విడుద‌ల చేసింది. 

KS Eshwarappa: కాంట్రాక్టర్ మృతి కేసులో బీజేపీ నేత ఈశ్వరప్పకు పోలీసుల క్లీన్ చిట్

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. దేశంలో ప్ర‌స్తుతం 1,48,881 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 18,294 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,31,50,434 కు పెరిగింది. కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 3,227 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.34 శాతం ఉన్నాయని, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.46 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత అన్‌పార్ల‌మెంట‌రీ సర్కారు.. : మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

దేశ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద గురువారం ఉద‌యం 8 గంటలకు వ‌ర‌కు 200.91 కోట్ల డోసులు అంద‌జేశారు. మంత్రిత్వ శాఖ ప్రకారం రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతం, వీక్లీ యాక్టివ్ రేటు 4.51 శాతంగా నమోదైంది.

కాగా.. దేశంలో క‌రోనా వ‌ల్ల ఎక్కువ‌గా మహారాష్ట్ర ప్ర‌భావితం అయ్యింది. ఈ రాష్ట్రంలో  ఇప్ప‌టి వ‌ర‌కు 80,25,106 మందికి వ్యాధి సోకింది. 1,48,039 మంది మరణించారు. అలాగే కేర‌ళ లో ఆదివారం నాటికి 66,95,609 మందికి క‌రోనా సోకింది. 70,303 మంది రోగులు చ‌నిపోయారు. అత్య‌ధికంగా ప్ర‌భావితం అయిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో కేర‌ళ నిలిచింది. తమిళనాడులో 35,24,258 కేసులు, 38,030 మరణాలు సంభ‌వించాయి. కర్ణాటకలో 39,90,057 కేసులు, 40,089 మరణాలు న‌మోద‌య్యాయి. 

ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు 14 మంది దుర్మరణం.. రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం యోగి

అయితే  ఇప్ప‌టికే క‌రోనా వ‌ల్ల అధికంగా ప్ర‌భావితం అయిన రాష్ట్రాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్ఓతంది మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా చాలా కొత్త కేసులు ఎక్కువ‌గానే వస్తున్నాయి. మహారాష్ట్రలో తక్కువ పరీక్షలు కారణంగా కేసులు త‌క్కువ సంఖ్య‌లోనే క‌నిపిస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 2,325 కొత్త కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 2,116 కేసులు న‌మోదు కాగా.. కేరళలో ఆదివారం 2,601 మందికి కరోనా వైరస్ సోకింది. కర్ణాటకలో 1,478 కొత్త కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios