Asianet News TeluguAsianet News Telugu

నేటి నుంచి 12-14 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు కోవిడ్- 19 టీకా.. ఏ వ్యాక్సిన్ ఇస్తారంటే ?

12-14 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలకు నేటి నుంచి కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే వీరికి Corbevax టీకా వేయనున్నారు. రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 

covid-19 vaccine for children under 12-14 years of age from today
Author
New Delhi, First Published Mar 16, 2022, 8:50 AM IST

న్యూఢిల్లీ : క‌రోనా వైర‌స్ (corona virus) నుంచి పిల్ల‌ల‌ను ర‌క్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వారికి వ్యాక్సిన్ (vaccine) ఇవ్వ‌నుంది. ఇప్ప‌టికే టీనేజ్ పిల్ల‌ల‌కు టీకా ఇచ్చేశారు. అయితే నేటి నుంచి 12-14 సంవత్సరాల మధ్య పిల్లలకు క‌రోనా టీకా ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

12-14 ఏళ్ల మ‌ధ్య‌నున్న పిల్ల‌ల‌కు బయోలాజికల్ ఇ ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ అయిన కార్బెవాక్స్ (Corbevax) మాత్రమే ఇవ్వ‌నున్నారు. వీరికి కూడా రెండు డోసుల టీకా ఇస్తారు. రెండు డోసుల‌కు మ‌ధ్య 28 రోజుల గ్యాప్ ఉంటుంద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఇప్ప‌టికే 14-15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్ల‌ల‌కు, అలాగే 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్ల‌ల‌కు టీకా అంద‌జేశారు. 

ప్రభుత్వ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మార్చి 1, 2021 నాటికి దేశంలో 12 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల 4.7 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. 2010 లేదా అంతకుముందు జన్మించిన పిల్ల‌లు అంద‌రూ  ఈ వ్యాక్సిన్ కోసం CoWIN పోర్ట‌ల్ లో వ్యాక్సిన్ న‌మోదు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. 

CorBEvax ఇచ్చే తేదీ నాటికి పిల్లల వ‌య‌స్సు క‌చ్చితంగా 12 సంవ‌త్సరాలు ఉండాల‌ని ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. ఈ వ‌య‌స్సును వ్యాక్సిన్ ను ఇచ్చే సిబ్బంది నిర్దారించుకోవాల‌ని సూచించింది. CoWINలో రిజిస్ట‌ర్ చేసుకొని 12 ఏళ్లు నిండ‌క‌పోతే టీకాలు వేయకూడ‌ద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. కుటుంబ స‌భ్యుల ఫోన్ నెంబ‌ర్ ద్వారా లేదా కోవిన్ పోర్ట‌ల్ ఇప్ప‌టికే ఉన్న అకౌంట్ ద్వారా సుల‌భంగా రిజిస్ట్రేషన్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 

భార‌త పౌరులందరూ వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రభుత్వ COVID-19 కేంద్రాలలో ఉచిత COVID-19 టీకాను పొందేందుకు అర్హుల‌ని ప్ర‌భుత్వం తెలిపింది. కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా ప్రకారం.. కొమొర్బిడిటీలు ఉన్న పిల్లలకు ఇమ్యునైజేషన్‌పై ప్రాథమిక దృష్టి కేంద్రీకరించబడింది. అయితే అలాంటి పిల్లల డేటా అందుబాటులో లేదు. కాబట్టి ప్రభుత్వం 12-15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఇమ్యునైజేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది.

గత ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు (HCWs) టీకాలు అందించారు. గత ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్‌లైన్ కార్మికుల (ఎఫ్‌ఎల్‌డబ్ల్యూ) టీకాలు వేయడం ప్రారంభమైంది. COVID-19 టీకా తదుపరి దశ మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడిన వారికి మరియు 45 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 1, 2021 నుండి 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సినేషన్‌ను అందించే ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించింది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ గత ఏడాది మే 1 నుంచి టీకాలు వేయడానికి అనుమతించడం ద్వారా టీకా కార్యక్రమాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios