Asianet News TeluguAsianet News Telugu

పొంచివున్న కోవిడ్ ముప్పు: అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల‌తో స‌మీక్ష

Coronavirus-India: భార‌త్ లో గ‌త వారం నుంచి నిత్యం వేయికి పైగా కొత్త కేసులు న‌మోద‌వుతు కోవిడ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 6,050  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న‌టితో పోలిస్తే 13 శాతమ‌ని కోవిడ్ గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం అత్యున్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించింది. కోవిడ్ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించింది. 
 

Covid 19 outbreak: Center to Covid review meet with Health Ministers of all States and Union Territories RMA
Author
First Published Apr 7, 2023, 2:27 PM IST

Union health minister chairs Covid review meet: దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ శుక్ర‌వారం నాడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితులు, వైర‌స్ వ్యాప్తి, నివార‌ణకు తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఇదివర‌కు ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న కోవిడ్ ప‌రిస్థితిపై స‌మీక్ష జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 

వివ‌రాల్లోకెళ్తే..  భార‌త్ లో గ‌త వారం నుంచి నిత్యం వేయికి పైగా కొత్త కేసులు న‌మోద‌వుతు కోవిడ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 6,050  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న‌టితో పోలిస్తే 13 శాతమ‌ని కోవిడ్ గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం అత్యున్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించింది. కోవిడ్ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించింది. దేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల మధ్య, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ రోజు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.

 

 

"కోవిడ్-19పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం క్రమం తప్పకుండా మార్గదర్శకాలు జారీ చేస్తోంది. దీనిపై ప్రధాని న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలతో ఇదివ‌ర‌కు సమీక్ష నిర్వహించారు. శుక్ర‌వారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మ‌న్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు" అని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్  అంత‌కుముందు తెలిపిన‌ట్టు ఏఎన్ఐ నివేదించింది. కాగా, భారతదేశంలో శుక్రవారం 6,050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి 5,335 ఇన్ఫెక్షన్ల సంఖ్యతో పోలిస్తే 13 శాతం ఎక్కువ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసులు 28,303 కాగా, ఇదే సమయంలో వైరస్ కారణంగా మరో 14 మరణాలు సంభవించాయి.

కోవిడ్ -19 కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 5,30,943 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,41,85,858కి చేరింది. గత 24 గంటల్లో 2,334 వ్యాక్సిన్ డోసులు వేశారు. జనవరి 16, 2021 న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 2,20,66,20,700 టీకాలు వేసిన‌ట్టు కేంద్రం పేర్కొంది. భారతదేశం పెరుగుతున్న కోవిడ్ గ్రాఫ్ కు కార‌ణ‌మ‌వుతున్నప్ర‌ధాన రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర,  కేరళ, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లు ఉన్నాయి. వీటితో పాలు మ‌రికొన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios