Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: 82 శాతం మందికి క‌రోనా టీకా రెండు డోసులు.. భారీగా త‌గ్గిన కొత్త కేసులు !

Coronavirus: క‌రోనా ప్ర‌భావం నేప‌థ్యంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను అధికార యంత్రాంగం ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టివ‌ర‌కు పెద్ద‌ల్లో 82 శాతం మందికి రెండు డోసుల క‌రోనా టీకాలు వేశారు. 97 శాతం మంది మొద‌టి డోసు టీకా అందుకున్నారు. ఇదే క్ర‌మంలో దేశంలో కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. 
 

Coronavirus Omicron variant India live updates: 80% of Indias adults now fully vaccinated, 97% got 1st shot: Government
Author
Hyderabad, First Published Feb 20, 2022, 10:01 AM IST

Coronavirus: ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. గ‌త నెల రోజుల నుంచి భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ ప్రభావం కొనసాగుతోంది. అయితే, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టింది. రోజువారీ కేసులు  ఏకంగా 20 వేల దిగువ‌కు ప‌డిపోయాయి. అయితే, థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం అధికంగా లేక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండ‌ట‌మే న‌ని ప‌లువురు నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇదిలావుండ‌గా, క‌రోనా ప్ర‌భావం నేప‌థ్యంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను అధికార యంత్రాంగం ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రెండు కోట్ల మంది టీనేజ‌ర్ల‌కు (15-18 ఏండ్ల వ‌య‌స్సు ఉన్న‌వారికి) రెండు డోసుల వ్యాక్సిన్లు అందించారు. 15-18 మ‌ధ్య సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న రెండు కోట్ల మందికి కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అలాగే, పెద్ద‌ల్లో 80 శాతం మందికి  రెండు డోసుల క‌రోనా  టీకాలు వేశారు. అలాగే, దాదాపు 97 శాతం మంది మొద‌టి డోసును అందుకున్నారు. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 175.4 కోట్ల కోవిడ్‌-19 టీకా డోసుల‌ను పంపిణీ చేశారు. అందులో మొద‌టి డోసు తీసుకున్న వారి సంఖ్య 90.7 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు అందుకున్న వారి సంఖ్య 75.2 కోట్ల‌కు చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

ఇదిలావుండ‌గా దేశంలో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య త‌గ్గిపోయింది. కొత్త కేసుల్లో భారీ క్షీణ‌త చోటుచేసుకుంది. దేశంలో క‌రోనా కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్ట‌గా.. మ‌ర‌ణాలు స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్తగా 19,968  కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో  దేశంలో క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య మొత్తం 4,28,22,473 కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో 48,847 (RECOVERED) మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రిక‌వ‌రీల సంఖ్య 4,20,86,383 కి పెరిగింది. ప్ర‌స్తుతం 2,24,187 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 673 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5,11,903 మంది కరోనా వైర‌స్ కార‌ణంగా మరణించారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.2 శాతంగా ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.5 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 78,56,994 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అలాగే, 1,43,576 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios