Asianet News TeluguAsianet News Telugu

భార‌త్ లోకి ప్ర‌వేశించిన క‌రోనా సూప‌ర్ వేరియంట్.. కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..?

NEW DELHI: ప్రస్తుతం కరోనా వైరస్ సూపర్ వేరియంట్ గా పేర్కొంటున్న ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ (XBB.1.5 Variant) అమెరికాలోని అనేక నగరాల్లో కోవిడ్-19 వ్యాప్తికి కార‌ణం అవుతోంది. అత్యంత వేగంగా వ్యాపించడంతో పాటు ఇది టీకాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంద‌ని వైద్య  నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ సూప‌ర్ వేరియంట్ కేసులు భార‌త్ లోనూ వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ మ్యుటేషన్  రెండు కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. వీటిలో ఒక్కొటి గుజరాత్,  మహారాష్ట్రలో నమోదయ్యాయి.
 

Corona virus super variant XBB.1.5 entered India; 214 new cases have been registered in the country
Author
First Published Jan 7, 2023, 2:13 PM IST

Coronavirus Updates: చైనా, అమెరికా, సౌత్ కొరియా, థాయ్ లాండ్ స‌హా ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ఆయా దేశాల్లో కోవిడ్-19 ఉద్ధృతికి కార‌ణ‌మైన వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగుచూడ‌టం ఆందోళన క‌లిగిస్తోంది. ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు స్థిరంగా కొన‌సాగుతున్నాయ‌ని కోవిడ్ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. భార‌త్ లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 214  కోవిడ్-19 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శ‌నివారం ఉద‌యం వెల్ల‌డించింది. సంబంధిత వివ‌రాల ప్ర‌కారం.. కొత్త‌గా 214 కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో కోవిడ్-19 క్రియాశీల కేసుల సంఖ్య స్వల్పంగా 2,509 కి పెరిగింది. కొత్త కేసుల‌తో క‌లిపి మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,79,761) చేరింది.

గత 24 గంటల్లో న‌లుగురు క‌రోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య 5,30,718కి పెరిగింది, తాజా మ‌ర‌ణాల్లో కేరళలో రెండు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుండి ఒక్కొక్కటి నివేదించబడ్డాయి. రోజువారీ కోవిడ్-19 సానుకూలత రేటు 0.11 శాతంగా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, వారానికి అనుకూలత రేటు 0.12 శాతంగా ఉంది. 
మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో ఆరు కేసుల పెరుగుదల నమోదైంది.

భార‌త్ లోకి ప్ర‌వేశించిన సూప‌ర్ వేరియంట్ ఎక్స్ బీబీ.1.5 వేరియంట్.. 

ప్రస్తుతం కరోనా వైరస్ సూపర్ వేరియంట్ గా పేర్కొంటున్న ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ (XBB.1.5 Variant) అమెరికాలోని అనేక నగరాల్లో కోవిడ్-19 వ్యాప్తికి కార‌ణం అవుతోంది. అత్యంత వేగంగా వ్యాపించడంతో పాటు ఇది టీకాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంద‌ని వైద్య  నిపుణులు అంచ‌నా వేస్తున్నాయి. ఈ సూప‌ర్ వేరియంట్ కేసులు భార‌త్ లోనూ వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ మ్యుటేషన్  రెండు కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. వీటిలో ఒక్కొటి గుజరాత్,  మహారాష్ట్రలో నమోదయ్యాయి.

చైనాలో కోవిడ్ -19 వేవ్ కు కార‌ణ‌మైన‌ సార్స్-కోవ్-2కు చెందిన బీఎఫ్.7 వేరియంట్  కేసులు ఇప్ప‌టికే భార‌త్ లో నమోద‌య్యాయి. దీని భ‌యాందోళ‌న‌లు కొన‌సాగుతున్న త‌రుణంలో ప్ర‌స్తుతం అమెరికాలో అత్యంత వేగంగా విస్త‌రిస్తూ.. జ‌నాన్ని ఆస్ప‌త్రుల‌కు ప‌రుగులు తీసే విధంగా చేస్తున్న ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ కేసులు భార‌త్ లో రెండు న‌మోద‌య్యాయి. దీంతో అధ‌కార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. కోవిడ్-19 నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్పుడు రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య వేరియంట్ గా ఎక్స్ బీబీ.1.5 మారే అవకాశం ఉంద‌నీ, ఇది ప్ర‌పంచవ్యాప్తంగా మ‌రో కోవిడ్-19 వేక్ కు కార‌ణ‌మ‌వుతుంద‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. 

ఈ వేరియంట్ పై ప‌రిశోధ‌కులు, వైద్యులు సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్ర‌స్తుత అమెరికాలో విజృంభిస్తున్న తీరుపై గురించి వివ‌రిస్తూ.. ఈ ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తోంది. అలాగే, దీని కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరే రేటు సైతం పెరుగుతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవిడ్-19 టీకాల‌ను ఇది ఎదుర్కొన‌గ‌ల‌ద‌నీ, రోగ నిరోధ‌కశ‌క్తి నుంచి ఈ వేరియంట్ త‌ప్పించుకోగ‌ల‌ద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

అమెరికాకు చెందిన ఒక ప‌రిశోధ‌కుడు ఈ వేరియంట్ వ్యాప్తిపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ ఎక్కువగా ఉన్న అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. "రోగనిరోధక శక్తి (అధిక తప్పించుకోవడం), మానవ కణాలతో సంలీనం (అధిక ఎసీఈ 2 బైండింగ్) కు వ్యతిరేకంగా అత్యంత తప్పించుకునే వేరియంట్లలో ఒకటిగా.. ఇత‌ర రెండు ప్ర‌మాద‌క‌ర వేరియంట్ల కంటే ఘోర‌మైన‌దిగా పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios