Asianet News TeluguAsianet News Telugu

దేశంలో త‌గ్గుతున్న క‌రోనా.. 715 రోజుల త‌రువాత మొద‌టి సారిగా 1,000 కొత్త కేసులు న‌మోదు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తేస్తోంది. దాదాపు రెండేళ్ల తరువాత దేశంలో కోవిడ్ -19 కొత్త కేసులు వెయ్యి కంటే తక్కువగా నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. 

Corona declining in the country .. 1,000 new cases registered for the first time in 715 days
Author
First Published Apr 4, 2022, 1:09 PM IST

భార‌త్ లో క‌రోనా తీవ్ర‌త త‌గ్గుతోంది. దాదాపు 715 రోజుల్లో త‌రువాత మొద‌టి సారిగా 1,000 కంటే త‌క్కువ కొత్త కోవిడ్ -19 కేసులు నమోద‌య్యాయి. దీంతో పాటు దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 13,000 కంటే తక్కువకు పడిపోయింది. ఈ వివ‌రాల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్ల‌డించింది. 

గ‌డిచిన 24 గంట‌ల వ్యవధిలో మొత్తం 913 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2020 ఏప్రిల్ 18వ తేదీన  991 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అప్ప‌టి నుంచి కేసులు పెరుగుతూనే వ‌స్తున్నాయి. దాదాపు రెండేళ్ల త‌రువాత ఈ కేసుల సంఖ్య ఇంత‌లా ప‌డిపోయింది. కాగా గ‌డిచిన 24 గంటల్లో కోవిడ్-19తో దేశ వ్యాప్తంగా 13  మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,21,358కి చేరుకుంది.

ఇండియాలో కోవిడ్ -19 యాక్టివ్ కేసుల సంఖ్య 714 రోజుల్లో 12,597 కి త‌గ్గింది. 2020 ఏప్రిల్ 18వ తేదీన 12,974 కేసులు గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవ‌లం 0.03 శాతం మాత్ర‌మే యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 1,316 మంది రోగులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇప్పుడు 4,24,96,089కి
చేరుకుంది. పర్యవసానంగా భార‌త్ మొత్తం రిక‌వ‌రీ రేటు 98.76 శాతంగా ఉంది.

అదే సమయంలో దేశవ్యా ప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 3,14,823 పరీక్షలు నిర్వహించార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 79.10 కోట్ల ప‌రీక్షలు నిర్వహించిన్న‌ట్టు అయ్యింద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 0.22 శాతంగా ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా న‌మోదైంది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ‌వారం విడుద‌ల చేసిన నివేదిక‌ల ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు 184.70 కోట్ల కోవిడ్ -19 టీకా డోసులు దేశ పౌరుల‌కు అందాయి. సోమ‌వారం ఉద‌యం నాటికి 15.55 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్, ఉప‌యోగించ‌ని కోవిడ్ వ్యా క్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. 

ఇదిలా ఉండ‌గా ప్రపంచంలోని ప‌లు దేశాల్లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. సోమ‌వారం నాటికి ఉన్న స‌మాచారం ప్రకారం గ‌డిచిన రెండేళ్ల‌తో పోలిస్తే ప్ర‌స్తుతం చైనాలో అత్య‌ధిక కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు 489.4 మిలియన్లను దాటేశాయి. మరణాలు 6.14 మిలియన్లకు పైగా పెరిగాయి. కాగా యూకేలో కొత్త క‌రోనా వేరియంట్ ను గుర్తించారు. దీనిని XE గా పిలుస్తున్నారు. BA.2 వేరియంట్‌తో పోలిస్తే XE రీకాంబినెంట్ కమ్యూనిటీ వృద్ధి రేటు అధికంగా ఉంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. కాగా యూకేలో మార్చి 26వ తేదీ నాటికి దాదాపు 4.9 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ తాజా వేవ్ కు వేగంగా వ్యాపించే ఓమిక్రాన్ వేరియంట్ BA.2 కారణమైంది. ఇదే ప్ర‌స్తుతం UK అంతటా ఆధిపత్యం చెలాయిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios