Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది: ఏసియానెట్ న్యూస్ Exclusive interviewలో ప్రధాని మోదీ (వీడియో)

బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అనేలా పరిస్థితిని సృష్టించారు. కానీ నిజం ఏమిటంటే బిజెపిలోనే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సభ్యులు ఉన్నారు. నా మంత్రివర్గంలోనే గరిష్ట సంఖ్యలో ఓబీసీలు ఉన్నారు.

BJP vote share will increase in these general elections - PM Narendra Modi on Asianet News Exclusive interview
Author
First Published Apr 20, 2024, 8:00 PM IST

తెలంగాణలో గతంతో పోల్చితే ఇప్పుడు బీజేపీ ఓట్ల శాతం మరింత పెరుగుతుందని పార్టీ మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఏసియానెట్ న్యూస్ తో ప్రత్యేంగా సుదీర్ఘంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రస్తావన తెచ్చినపుడు.. తాము తెలంగాణలో మరింత బలోపేతం అవుతామని చెప్పారు.బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అనేలా పరిస్థితిని సృష్టించారు. కానీ నిజం ఏమిటంటే బిజెపిలోనే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సభ్యులు ఉన్నారు. నా మంత్రివర్గంలోనే గరిష్ట సంఖ్యలో ఓబీసీలు ఉన్నారు. అప్పుడు బీజేపీ అర్బన్ పార్టీ అనే మరో కథనాన్ని సృష్టించారు. ప్రస్తుతం మా పార్టీ గ్రామాల్లో బలంగా వుందని... గ్రామీణ ప్రజలే ఎక్కువగా పార్టీవెంట వున్నారు. దీంతో ఈసారి బీజేపీ చాలా సంప్రదాయ పార్టీగా ముద్రపడింది... ఈ పార్టీ కొత్తగా ఏమీ ఆలోచించదని అంటున్నారు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఉద్యమానికి ఎవరైనా నాయకత్వం వహిస్తున్నారంటే అది బీజేపీ పాలక ప్రభుత్వమే. కాబట్టి బిజెపిని అడ్డుకునేందుకు ప్రచారం జరుగుతున్న కథనాలన్ని అపోహలు మాత్రమే. 

BJP vote share will increase in these general elections - PM Narendra Modi on Asianet News Exclusive interview

రెండోది తెలంగాణలో చూసుకుంటే బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. అత్యధిక ఎంపీలు బీజేపీకి చెందినవారే. గతంతో పోలిస్తే 2024లో ఓట్ల శాతం చాలా పెరుగుతుందని నేను నమ్ముతున్నాను.

దక్షిణాది ప్రభుత్వాల గుర్తింపు ఏమిటి? కాంగ్రెస్ అయినా, ఎల్‌డీఎఫ్ అయినా, డీఎంకే అయినా అన్ని చోట్లా వుందా? ఈ రోజు మనం పుదుచ్చేరిలో అధికారంలో ఉన్నాం. పుదుచ్చేరి దక్షిణాదిలో ఉందికదా...  ఎక్కువగా దక్షిణాది వారు, బెంగాలీ నివసించే అండమాన్ నికోబార్‌లో మా ఎంపీ విజయం సాధించారు.

కుటుంబ పార్టీలు, ప్రభుత్వాలు వున్నచోట భారీ అవినీతి వుంది. ఇప్పుడు దక్షిణాదిన ఎలాంటి పరిస్థితి వుందో చూడండి. కాంగ్రెస్ యువవరాజు రాహుల్ గాంధీ ఉత్తరాది నుండి పారిపోయి దక్షిణాదిలో ఆశ్రయం పొందుతున్నాడు. ప్రస్తుతం అతడు వయనాడ్ లో పోటీ చేస్తున్నాడు. అయితే అతడి పరిస్థితి ఎలా వుందంటే ఏప్రిల్ 26న వయనాడ్ లో పోలింగ్ ముగియగానే మరో చోట పోటీ చేయాలని భావిస్తున్నాడు. మరో సీటుకోసం వెతుకుతున్నాడు.నేను చెప్పే ఈ మాటలు రాసిపెట్టుకొండి. 

కాంగ్రెస్ కు చెందిన పెద్ద నాయకులు ఇకపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని... రాజ్యసభకు వెళతారని నేను ఒకసారి పార్లమెంటులో ప్రకటించాను. నేను ఈ మాట చెప్పిన ఒక నెలరోజుల తర్వాత అతిపెద్ద నాయకురాలు లోక్‌సభ నుండి నిష్క్రమించవలసి వచ్చింది. ఆమె రాజ్యసభకు వెళ్లారు. అంటే ఓటమి అంగీకరించినట్లు కదా. ఈసారి కూడా తాను చెప్పినట్లు జరుగుతుందని నమ్ముతున్నాను.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ క్రతులు జరుగుతున్నపుడు నేను దక్షిణాదిన పర్యటించాను. అప్పుడు అక్కడి ప్రజలు నాపై చూపిన ప్రేమ మరియు  విశ్వాసం అపూర్వమైనది. కాబట్టి ఇప్పుడు భ్రమలన్నీ తొలగిపోతాయి.  అతి త్వరలోనే చాలామంది దక్షిణాది బిజెపి నేతలకు కూడా వారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కుతుంది.  చాలా ఎక్కువమందికి తనతో కలిసి పార్లమెంట్ లో పనిచేసే అవకాశం దక్కుతుంది. దక్షిణాదిన  ఓట్ షేర్ కూడా గణనీయంగా పెరుగుతుంది. అని మోదీ తెలిపారు.

ఏసియానెట్ న్యూస్ Exclusive interviewని ఇక్కడ చూడండి (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios