Asianet News TeluguAsianet News Telugu

Omicron Variant : భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. గుజరాత్‌లో కొత్తగా ఒకరికి, దేశంలో మూడుకు చేరిన కేసులు

భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో (karnataka) ఇద్దరికి ఈ వైరస్ సోకింది. తాజాగా దేశంలో మూడో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసింది. గుజరాత్‌కు (gujarat) చెందిన వ్యక్తికి ఈ వైరస్ నిర్థారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల దక్షిణాఫ్రికా (south africa) నుంచి భారత్‌కు వచ్చిన ఈ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్థారించారు

After Karnataka one person tests positive for new variant in Gujarat
Author
Ahmedabad, First Published Dec 4, 2021, 2:40 PM IST

భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో (karnataka) ఇద్దరికి ఈ వైరస్ సోకింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఏదో ఒక దారిలో ఈ మహమ్మారి ప్రవేశిస్తూనే వుంది. తాజాగా దేశంలో మూడో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసింది. గుజరాత్‌కు (gujarat) చెందిన వ్యక్తికి ఈ వైరస్ నిర్థారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల దక్షిణాఫ్రికా (south africa) నుంచి భారత్‌కు వచ్చిన ఈ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్థారించారు. తాజా కేసుతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరుకున్నాయి. 

మరోవైపు ఒమ్రికాన్ పాజిటివ్ వ‌చ్చిన ఓ విదేశీయుడు పారిపోయిన ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. ఒమ్రికాన్ పాజిటివ్ వ‌చ్చిన ఇద్ద‌రిలో ఒక‌రు ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి నెగెటివ్ స‌ర్టిఫికెట్ తీసుకుని తిరిగి స్వ‌స్థ‌లానికి వెళ్లిపోయార‌ని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అలాగే ద‌క్షిణాఫ్రికా నుంచి వ‌చ్చిన 10 మంది ప్ర‌యాణీకులకు నిర్వ‌హించ‌కుండానే వారు క‌నిపించ‌కుండా పోయారు. వారి కోసం ప్ర‌స్తుతం త‌మ అధికారులు వెతుకుతున్నార‌ని, ఈ రోజు రాత్రి వర‌కు వారి ఆచూకీ క‌నిపెడ‌తామ‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  ఈ విషయం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌రం రేపుతోంది. 

Also Read:క‌ర్నాట‌క నుంచి పారిపోయిన ఒమ్రికాన్ సోకిన విదేశీయుడు..ఆల‌స్యంగా వెలుగులోకి..

గత నెల 20వ తారీఖున 66 ఏళ్ల ద‌క్షిణాఫ్రికా జాతీయుడు క‌ర్నాట‌కకు వ‌చ్చారు. అత‌డు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు, క‌రోనా నెగిటివ్ స‌ర్టిఫికెట్ త‌న వెంట తీసుకొని వ‌చ్చారు. అదే రోజు ఆయ‌న షాంగ్రి లా అనే హోటల్ లో బ‌స చేశాడు. ఆ స‌మ‌యంలోనే అత‌డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డ్డాడు. అత‌డిని ప్ర‌భుత్వ వైద్యుడు ప‌రిశీలించిన స‌మ‌యంలో ఆ వ్య‌క్తిలో క‌రోనా ల‌క్ష‌ణాలేవీ లేక‌పోవ‌డంతో, క్వారంటైన్ ఉండాల్సిందిగా సూచించారు. అయితే ఆ ద‌క్షిణాఫ్రికా జాతీయుడు రిస్క్ దేశాల లిస్ట్‌లో నుంచి వ‌చ్చినందున అత‌డి నుంచి సేక‌రించిన న‌మూనాల‌ను నవంబ‌ర్ 22వ తేదీన జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు.

అయితే అత‌డు నవంబ‌ర్ 23న ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో మ‌ళ్లీ క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో నెగెటివ్‌గా ఫ‌లితం వ‌చ్చింది. దీంతో అత‌డు న‌వంబ‌ర్ 27వ తేదీన క్యాబ్ తీసుకొని విమానాశ్ర‌యానికి వెళ్లి అక్క‌డి నుంచి దుబాయ్‌కు వెళ్లాడు. అత‌డు బ‌య‌లుదేరిన స‌మ‌యంలోనే అత‌డికి ఒమ్రికాన్ వేరియంట్ సోకిన‌ట్టుగా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో అత‌డితో కాంటాక్ట్‌లో ఉన్న మ‌రో 24 మందిని ప‌రీక్షించారు. వారికి కోవిడ్ -19గా నిర్ధార‌ణ అయ్యింది. సెకండ‌రీ కాంటాక్ట్‌గా గుర్తించిన మ‌రో 240 మందిని ప‌రీక్షించగా వారు కూడా నెగిటివ్‌గా ఉన్న‌ట్టు నిర్ధారించారు. ఈ విష‌యాల‌న్నీ ఉన్న‌త స్థాయి స‌మావేశం అనంత‌రం ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ నిర్ధారించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios