Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. దేశంలో 40 వేలు దాటిన యాక్టివ్ కరోనా కేసులు.. కొత్తగా 7,830 కోవిడ్ కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 40 వేల మార్కును దాటాయి. కొత్త నమోదు అవుతున్న కేసుల్లో ఎక్స్ బీబీ.1.16కి వేరియంట్ కు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. 

active corona cases crossed 40 thousand in the country.. 7,830 new covid cases registered..ISR
Author
First Published Apr 12, 2023, 11:29 AM IST

భారత్ లో కరోనా కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 7,830 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 40 వేలు మార్కును దాటింది. అయితే ఇన్ఫెక్షన్ రేటు కూడా పెరుగుతోంది. మంగళవారం 2.88 శాతంగా ఉన్న ఈ రేటు బుధవారం నాటికి 3.65 శాతంగా నమోదైంది. మంగళవారం 5,676 కేసులు నమోదయ్యాయి. 

జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత..

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 40,215గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశం వ్యాప్తంగా కరోనా బారిన పడి 44,20,4771 మంది కోలుకోగా, రికవరీ రేటు 98.74 శాతానికి పెరిగింది. సోమవారం మొత్తం టెస్టుల సంఖ్య 2,14,242కి చేరింది. ఇదిలా ఉండగా దేశ రాజధానిలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఢిల్లీలో 980 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఇద్దరు రోగులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫెక్షన్ రేటు 25.98 శాతంగా నమోదైంది. 3,772 పరీక్షలు నిర్వహించారు.

టీఎస్ పీఎస్సీ లీక్ కేసు.. పరీక్ష రాసి, టెన్షన్ తో నిద్రలేని రాత్రులు.. దొరక్కూడదని దేవస్థానాలన్నీ తిరిగిన జంట

ఢిల్లీతో పాటు మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 919 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ రాష్ట్రంలో సోమవారం 328 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఒకే రోజులో దాదాపు మూడు రేట్లు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కాకుండా ఉత్తరాఖండ్‌లో కూడా 100 కి పైగా కేసులు నమోదయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 197 కి చేరుకుంది.

రైతుల కుమారులను పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు రూ.2 లక్షలిస్తాం - కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి హామీ..

ఉత్తరప్రదేశ్‌లో కూడా కరోనా వేగం భయపెడుతోంది. ఇక్కడ 402 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క లక్నోలోనే 83 కేసులు నమోదు కాగా, ఘజియాబాద్‌లో 70 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీలో పరీక్షలను పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. భారత్ లో వెలుగులోకి వస్తున్న కేసుల్లో కొన్ని కొత్త వేరియంట్ ఎక్స్ బీబీ.1.16కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇలాంటి కేసులు 38 శాతం నమోదవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios