Asianet News TeluguAsianet News Telugu

నిత్యా మీనన్ ‘కుమారి శ్రీమతి’ రివ్యూ

క్లీన్‌ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌సిరీస్‌  కావటంతో  ఈ వీకెండ్‌లో టైమ్‌ పాస్‌ కోసం ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ వెబ్ సీరిస్  ‘కుమారి శ్రీమతి’ .

Nithya Menon Kumari Srimathi Web Series mini review jsp
Author
First Published Sep 30, 2023, 11:59 AM IST

నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యామేనన్‌ వరుసగా సిరీస్‌లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ‘కుమారి శ్రీమతి’ అంటూ ఓ వెబ్ సీరిస్ చేసింది.  ఈ సీరిస్ లో మసూద హీరో తిరువర్‌తోపాటు కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల ప్రధాన పాత్ర పోషించారు. డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల షో క్రియేటర్‍గా డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కుమారి శ్రీమతి ఎలా ఉంది?(kumari srimathi)ఈ సీరిస్ కథ ఏంటి?

రాజమండ్రి దగ్గరలోని రామరాజులంకలో  ఉండే సిరి అలియాస్‌ శ్రీమతి (నిత్యామేనన్‌) హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి, ఓ రెస్టారెంట్‌లో రూ.13వేల జీతానికి చేస్తుంటుంది. ఆమెకు ఒకటే లక్ష్యం ...తన  తాతల నాటి ఇంటిని కాపాడుకోవటం. ఈ ఇంటిని అమ్మేందుకు సిరి బాబాయి కేశవరావు (ప్రేమ్‌సాగర్‌) ప్రయత్నించడంతో కోర్టుకు ఎక్కుతుంది.  కేశవరావు కోర్టులో చూపిన ఆధారాలు తో ఇంటి విలువను రూ.38లక్షలుగా కోర్టు లెక్కగట్టి కావాలంటే ఆ మొత్తాన్ని ఆరు నెలల్లో కేశవరావుకు చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చని శ్రీమతికి కోర్టు ఒక అవకాశం ఇస్తుంది. దాంతో తనకు వచ్చే 13 వేలతో అంత పెద్ద మొత్తం ఆరు నెలల్లో సంపాదించలేమని గ్రహించి,  శ్రీమతి రూ.38లక్షలు సంపాదించడానికి ఊళ్లో బార్‌ పెట్టాలనుకుంటుంది. ఆ నిర్ణయం  శ్రీమతి జీవితంలో తీసుకువచ్చిన మార్పులు ఏమిటి..చివరకు తను ఇష్టపడే ఇంటిని సొంతం చేసుకోగలిగిందా..ఈ క్రమంలో శ్రీరామ్‌ (నిరుపమ్‌),  అభి (తిరువీర్‌),  దొరబాబు (గవిరెడ్డి శ్రీనివాస్‌) చేసిన సహాయం ఏంటి? చివరకు ఏమైంది అనే విషయం తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే!
   
ఎలా ఉందంటే...

ఈ సీరిస్ ని ఫన్, ఎమోషన్ గా తీర్చిద్దాలనే ప్రయత్నం చేసారు.  రూ. 38 లక్షలు సంపాదించుకోవడానికి బార్ పెట్టాలనుకోవడం, అందులోనూ 30 ఏళ్లు వచ్చిన పెళ్లి చేసుకోని అమ్మాయిని ప్రపంచం  చూసే విధానం వంటి అంశాలతో తీర్చిదిద్దారు. అలాగే ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటం, చిన్నప్పటి ప్రేమ,మద్యలో వచ్చే ట్విస్ట్ బాగున్నాయి. అయితే చిన్న కథను అన్ని ఎపిసోడ్స్ గా చేసే క్రమంలో సాగిన ఫీలింగ్ వస్తుంది. సినిమాలు చూస్తున్న కళ్లతో వెబ్ సీరిస్ లు చూడలేమని అలాంటప్పుడు అనిపిస్తుంది. ముఖ్యంగా బార్ పెట్టే క్రమంలో ఫన్ బాగా పండుతుందనుకుంటే ఆ ఎపిసోడ్ ఆ స్దాయిలో హిలేరియస్ గా లేదు. అయితే గెస్ట్ గా నాని, అవసరసరాల శ్రీనివాసరావు పాత్రలు బాగున్నాయి. టెక్నికల్ గానూ సౌండ్ గా ఉంది. 

 నటీనటులు: నిత్యామేనన్‌, గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీ మోహన్‌ తదితరులు;
 ప్రొడక్షన్‌ డిజైన్‌: లతా నాయుడు;
 కాస్టూమ్స్‌: గీతా గౌతమ్‌, నీరజ కోన(నిత్యామేనన్‌); 
సంగీతం: స్టెక్కటో & కమ్రాన్;
సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ; 
ఎడిటర్: సృజన అడుసుమిల్లి; 
కథ: బలభద్రపాత్రుని రమణి, మల్లిక్‌రామ్‌;
 రచన: ఉదయ్‌ అగమర్షన్‌, జయంత్‌ తాడినాడ, కౌశిక్‌ సుబ్రహ్మణ్య; 
స్క్రీన్‌ప్లే, సంభాషణలు, షో క్రియేట్‌: శ్రీనివాస్‌ అవసరాల; 
నిర్మాత: స్వప్న సినిమా; 
దర్శకత్వం: గోమఠేష్‌ ఉపాధ్యాయి;
 స్ట్రీమింగ్‌ ప్లాట్ ఫామ్: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

Follow Us:
Download App:
  • android
  • ios