Asianet News TeluguAsianet News Telugu

వేణు నక్షత్రం తెలుగు కవిత: గాపాత రోజులెప్పుడొస్తయో!

తెలుగు కవి, రచయిత వేణు నక్షత్రం కరోనా వైరస్ వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల మీద వేదనతో కవిత రాశారు. ఆ కవితను ఇక్కడ చదవండి.

Venu Nakshatram Telugu poem on the situation arised due to Coronavirus
Author
Hyderabad, First Published Jan 15, 2022, 10:53 AM IST

గాకరోనా డెల్టాలతోని - గన్నా గిన్నా  
మస్త్  బాధల్ పడ్తిమి
ఆస్తులు పాయె- పాస్తులు పాయె 
ఆఖరికి పానాలే పాయె 
గంతల్నే వ్యాక్సిన్లు అనిరి - బూస్టర్ షాట్లు అనిరి 
పోయినోండ్లు పోయిరి - ఇగ  ఉన్నోల్లమన్న 
జర్ర నిమ్మలంగుందాం అనుకుంటిమి 
ఇగ అంత సద్దుమణిగి నట్టే అనిపించె
సినిమాలు, షికార్లు అన్నీ షురూ ఆయే
గంతల్నే పండుగొస్తుందనిరి 
ఇగ పండుగనంగనే 
పప్పు బెల్లాలు - పరమన్నాలు 
అప్పాలు - చెగొడీలు 
కోడి కూర - ముంత కల్లు 
కొత్త బట్టలు -పతంగీలు
గంగిరెద్దులు - గంగి గోవులు 
గివన్నీ గుర్తుకు రాంగానె  
మన్సు మస్తు  ఖుషీగయ్యే 
ఇగ పండుగ షురూ చేద్దామనంగనే  
మల్లా మొదలాయె కొత్తగా ఓమిక్రాన్!
దగ్గులు- తుమ్ములు 
జ్వరాలు - నొప్పులు
మాస్కులు - శానిటైజర్లు
క్వారంటైన్ - క్వారంటైన్ 
‘పాడిందే పాడెరా పాసుపల్ల దాసరి’ అన్నట్లు
దీని పాడుగాను 
మూడేండ్ల సందీ గదే  ముచ్చట 
ఇంకెన్ని రోజులిట్ల  గడపాలో 
ఇంకెన్ని తిప్పలు పడాలో
గాపాత రోజులెప్పుడొస్తయో! 
కల్సి  పండుగెపుడు సేసుకుంటమో!! 

Follow Us:
Download App:
  • android
  • ios